రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. భానుడు ఉదయం పది గంటల నుంచే ఉగ్రరూపం దాల్చాడు. తెలంగాణలో వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంది. వృద్ధులు, పిల్లలు బయటకు రావొద్దని వాతావరణశాఖ హెచ్చరించింది. రాగల రెండు రోజుల పాటు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాల వారిగా నమోదైన ఉష్ణోగ్రతలను టీఎస్డీపీఎస్ ప్రకటించింది.
సంఖ్య | జిల్లా | ఉష్ణోగ్రత (డిగ్రీలలో) |
1 | ఆదిలాబాద్ | 45.0 |
2 | కుమురం భీం | 43.9 |
3 | మంచిర్యాల | 43.9 |
4 | నిర్మల్ | 44.8 |
5 | నిజామాబాద్ | 44.6 |
6 | జగిత్యాల | 44.9 |
7 | పెద్దపల్లి | 43.4 |
8 | జయశంకర్ భూపాల్‌పల్లి | 43.8 |
9 | భద్రాది కొత్తగూడెం | 42.3 |
10 | మహబూబాబాద్ | 41.7 |
11 | వరంగల్ రూరల్ | 42.6 |
12 | వరంగల్ అర్బన్ | 41.9 |
13 | కరీంనగర్ | 44.0 |
14 | రాజన్న సిరిసిల్ల | 45.1 |
15 | కామారెడ్డి | 43.9 |
16 | సంగారెడ్డి | 44.1 |
17 | మెదక్ | 42.8 |
18 | సిద్దిపేట | 44.0 |
19 | జనగాం | 42.3 |
20 | యాదాద్రి భువనగిరి | 43.1 |
21 | మేడ్చల్ మల్కాజిగిరి | 43.2 |
22 | హైదారాబాద్ | 44.0 |
23 | రంగారెడ్డి | 42.7 |
24 | వికారాబాద్ | 44.0 |
25 | మహబూబ్‌నగర్ | 43.6 |
26 | జోగులాంబ గద్వాల | 40.5 |
27 | వనపర్తి | 41.0 |
28 | నాగర్ కర్నూల్ | 43.0 |
29 | నల్గొండ | 42.9 |
30 | సూర్యాపేట | 42.3 |
31 | ఖమ్మం | 42.8 |
32 | ములుగు | 41.9 |
33 | నారాయణ పేట | 42.4 |