ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన వైకాపా అధినేత వైఎస్ జగన్.. విజయవాడ వేదికగా ప్రమాణ స్వీకారం చేశారు. తొలిసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన జగన్ ఓ అరుదైన ఘనతను సొంత చేసుకున్నారు. ఓ ముఖ్యమంత్రి కొడుకుగా.. ఏపీకి సీఎం అయ్యారు. ఓటమి ఎరుగని నేతగా వైఎస్ రాజశేఖరరెడ్డి .. రాజకీయ ప్రస్థానం అందరికీ సుపరిచితమే! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు రెండుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆయన.. రాజకీయాల్లో తిరుగులేని నేతగా చెరగని ముద్ర వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకొచ్చిన నేతగా.. పేరు సంపాదించుకున్నారు.
ఎదురించి పోరాడిన జగన్
ఘోర ప్రమాదంలో వైఎస్ అర్థాంతరంగా చనిపోయినా.. ఆయనను అభిమానించే జనం.. తెలుగు రాష్ట్రాల్లో మెండుగా ఉన్నారు. ఆయన వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేశారు యెడుగూరి సందింటి జగన్మోహన్ రెడ్డి. తండ్రి మరణం.. తదనంతర పరిణామాలతో చిక్కుల్లో పడ్డారు. ఆ తర్వాత ఏకంగా కాంగ్రెస్ అధిష్ఠానాన్నే ఎదిరించి... సొంతగా పార్టీని స్థాపించారు. కొడితే కుంభస్థలమే అంటూ.. ముఖ్యమంత్రి పదవిపై దృష్టి పెట్టారు. తొమ్మిదేళ్లుగా అలుపెరుగని పోరాటం సాగించారు. మొదటి దఫా..సీఎం పదవి అందినట్లే అంది.. చేజారి పోయినా.. నిరాశ పడకుండా.. దండయాత్ర కొనసాగించారు. ఎట్టకేలకు అనుకున్నది సాధించి.. నేడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఓ సీఎంకు కొడుకుగా.. ముఖ్యమంత్రి పదవికి ప్రమాణ స్వీకారం చేసి తెలుగు నేలపై ఓ సరికొత్త రికార్డును సృష్టించారు.
వైఎస్ బాటలోనే...