తెలంగాణ

telangana

ETV Bharat / state

Niranjan Reddy on Paddy Procurement: 'కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా.. స్పష్టంగా చెప్పిన తర్వాతే దిల్లీ నుంచి కదులుతాం'

ministers meets Piyush goyal : ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత కోసం... కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో రాష్ట్ర మంత్రుల బృందం సమావేశం ముగిసింది. ధాన్యం సేకరణపై లిఖితపూర్వక హామీ ఇవ్వాలని మంత్రులు, ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ విషయంపై రెండ్రోజుల్లో స్పష్టత ఇస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు.

niranjan reddy
niranjan reddy

By

Published : Dec 21, 2021, 6:13 PM IST

Updated : Dec 21, 2021, 8:24 PM IST

ministers meets Piyush goyal: రెండ్రోజులుగా హస్తిన వేదికగా సాగుతున్న... రాష్ట్రంలో వరి ధాన్యం కొనుగోలు వ్యవహారం.. కొలిక్కివచ్చేలా ఉంది. మధ్యాహ్నం కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌తో భేటి అయిన మంత్రుల బృందం.. పలు అంశాలపై చర్చించారు. ప్రధానంగా కేంద్రం నిర్దేశించిన 60 లక్షల మెట్రిక్‌ టన్నుల లక్ష్యం మించి... కొనుగోలు చేస్తామని.. పీయూష్‌ గోయల్‌ వద్ద రాతపూర్వక హామీ కోసం మంత్రులు పట్టుబట్టారు. రాష్ట్రంలో భాజపా నేతలు.. ధాన్యం కొనుగోలును రాజకీయం చేస్తున్నారని.. మంత్రులు దుయ్యబట్టారు.

'కిషన్‌రెడ్డికి బాధ్యత లేదా.. స్పష్టంగా చెప్పిన తర్వాతే దిల్లీ నుంచి కదులుతాం'

'నెలకు 40 లక్షల టన్నుల బియ్యం మిల్లింగ్‌ చేసే సామర్థ్యం రాష్ట్రంలో ఉంది. ధాన్యం సేకరణపై భాజపా నేతలు రాష్ట్రంలో చెప్తున్న అంశాలను పీయూష్‌కు వివరించాం. యాసంగిలో ధాన్యం కొనుగోలు చేసేది లేదని కేంద్రమంత్రి మరోసారి స్పష్టం చేశారు. వానాకాలం లక్ష్యం 60 లక్షల టన్నుల ధాన్యం మూడు రోజుల్లో పూర్తి కానుంది. రాష్ట్రంలో సేకరించాల్సిన ధాన్యం ఇంకా చాలా ఉందని చెప్పాం. మిగతా ధాన్యం సేకరించాలా వద్దా అని స్పష్టత కోరాం. కొనుగోలు కేంద్రాలు కొనసాగించాలా, మూసివేయాలా చెప్పాలని కోరాం. ధాన్యం సేకరణపై కేంద్రాన్ని లిఖితపూర్వక హామీ కోరాం. ఇందుకు పీయూష్‌ గోయల్‌ 2 రోజుల సమయం కోరారు. రెండ్రోజుల తర్వాత మరోసారి పీయూష్‌ గోయల్‌ను కలుస్తాం. స్పష్టంగా చెప్పిన తర్వాతే దిల్లీ నుంచి కదులుతాం.' -నిరంజన్‌ రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి

ధాన్యం కొనుగోలుపై పీయూష్‌ గోయిల్‌కు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సరైన అవగాహన కల్పించలేకపోయారని.. తెరాస పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వరరావు విమర్శించారు. రైల్వే వ్యాగన్ల సంఖ్య పెంచి.. ధాన్యాన్ని తరలించాలని రైల్వే మంత్రిని పీయూష్‌ ఆదేశించారని.. నామ పేర్కొన్నారు.

'తెలంగాణకు మనం ర్యాక్​లు ఇవ్వడం లేదు. అందువల్ల అక్కడ ధాన్యం స్టాక్​ అయిపోతుందని ఆరోజున చెప్పారు. ఈరోజున కూడా వారికదే విషయం గుర్తు చేశాను. మా అందరి ముందు రైల్వే మంత్రికి ఫోన్​ చేశారు. వచ్చిన ధాన్యమంతా 45 నుంచి 60 రోజుల మధ్య కొనుగోలు చేయాలి. మా మిల్లింగ్​ కెపాసిటీకి తగ్గట్టుగా మీరు మిల్లింగ్​ కెపాసిటీ చేయడానికి మాకు వాటా ఇవ్వడం లేదు ఇది మొదటి సమస్య. మీరిచ్చిన కోటాను ఎఫ్​సీఐ గోడౌన్​లోకి తరలించడం లేదు ఇది రెండో సమస్య. మూడోది ఎఫ్​సీఐ వాళ్లకు మీరు ర్యాక్​లు ఇవ్వడం లేదు.. ఇలా ప్రతి దశలోను మీ ప్రమేయం ఉందని.. మీరు చేయలేకపోవడం వల్లే ఈ సమస్య తలెత్తిందని వివరించాం.' -నామ నాగేశ్వరరావు, ఎంపీ

ధాన్యం కొనుగోలు వ్యవహారంలో... కేంద్రం నుంచి లిఖిత పూర్వక హామీ.. సాధ్యమైనంత త్వరగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఇప్పించాలని... నిరంజన్‌ రెడ్డి సూచించారు. ధాన్యం ఉత్పత్తిపై అవగాహన లేకుండా మాట్లాడటం... కిషన్‌రెడ్డి సరికాదని హితవు పలికారు.

ఇదీ చూడండి:Piyush Goyal on Cm kcr: 'ధాన్యం కొనుగోళ్లపై సీఎం కేసీఆర్ అబద్ధాలు చెబుతున్నారు'

Last Updated : Dec 21, 2021, 8:24 PM IST

ABOUT THE AUTHOR

...view details