KTR tweet on roads: కంటోన్మెంట్ ప్రాంతంలో నిబంధనలకు విరుద్ధంగా 21 రహదారులు మూసేశారంటూ పురపాలక మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆ రహదారులకు సంబంధించిన జాబితాను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ట్విటర్ ద్వారా పంపించారు. లక్షలాది మంది ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని.. ఆ రహదారులను తిరిగి వినియోగంలోకి తీసుకొచ్చేలా చూడాలని కేంద్ర మంత్రిని కేటీఆర్ కోరారు.
KTR tweet on roads: ఆ 21 రోడ్ల జాబితాను కిషన్ రెడ్డికి ట్వీట్ చేసిన కేటీఆర్ - cantonment roads closed
KTR tweet on roads: సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో మూసివేసిన 21 రహదారుల జాబితాను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి మంత్రి కేటీఆర్ ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. రహదారుల మూసివేతపై స్పందించిన కిషన్ రెడ్డి వాటి జాబితా ఇవ్వాలని మంత్రి కేటీఆర్‌ను కోరగా ఈ మేరకు ఆయన రీట్వీట్ చేశారు.
KTR tweet on cantonment roads: సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో రహదారులు మూసేయడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఓ వాహనదారుడు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. స్పందించిన కేటీఆర్.. ఆ విషయాన్ని కిషన్‌రెడ్డికి రీట్వీట్ చేశారు. 21 రహదారుల జాబితా ఇవ్వాలని కిషన్‌రెడ్డి కోరగా ఆయా రహదారుల పేర్లను ట్విటర్ ద్వారా కేటీఆర్ పంపించారు. కంటోన్మెంట్ ప్రాంతంలో రెండు రహదారులు మాత్రమే మూసేశామంటూ కేంద్రమంత్రి అజయ్‌భట్.. పార్లమెంటులో తప్పుడు సమాచారం ఇచ్చారని కేటీఆర్ రెండ్రోజుల క్రితం ట్విటర్ ద్వారా విమర్శించారు.
ఇదీ చదవండి:'కేంద్రం నోటి మాట కాదు... రాత పూర్వక హామీ ఇవ్వాలి.. అందుకే దిల్లీ వచ్చాం'