KTR at German Investors Summit : రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు 2 లక్షల ఎకరాల స్థలం అందుబాటులో ఉందని.. వాటి ఏర్పాటుకు మౌలిక వసతులు కల్పిస్తామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. హైదరాబాద్‌లో జర్మనీ పెట్టుబడిదారుల సదస్సుకు.. భారత్లో జర్మనీ రాయబారి వాల్టర్ జె.లిండ్నర్తో కలిసి కేటీఆర్ హాజరయ్యారు. ఏడున్నరేళ్లలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో అనేక కార్యక్రమాలు చేపట్టామని మంత్రి పేర్కొన్నారు. ప్రాధాన్యతా క్రమంలో సమస్యలను పరిష్కరించామన్న కేటీఆర్.. మొదట విద్యుత్ సమస్యను పరిష్కరించామని చెప్పారు. అన్ని రంగాలకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు.
Minister KTR Latest News : "పరిశ్రమల ఏర్పాటుకు 2 లక్షల ఎకరాలు అందుబాటులో ఉంది. కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తాం. పరిశ్రమలకు సింగిల్ విండో విధానంలో అనుమతులు మంజూరు చేస్తాం. దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నాం. పెట్టుబడులకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయి."
-కేటీఆర్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి
పెట్టుబడులకు ఆహ్వానం