పర్యావరణ పరిరక్షణ కోసం.. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ చురుగ్గా పాల్గొంటోంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ పార్క్‌లో తెలుగు సినీ రచయితలు సాయిమాధవ్ బుర్రా, లక్ష్మిభూపాల్, శ్రీకాంత్, నిర్మాత బీఏ రాజు మొక్కలు నాటి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములయ్యారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో సినీ రచయితలు - green india challenge in jubilee hills park
ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ చురుగ్గా పాల్గొంటోంది. నటీనటులు, దర్శకులు, రచయితలు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటుతూ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో.. తెలుగు సినీ రచయితలు
మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే పర్యావరణాన్ని ఆరోగ్యంగా ఉంచాలని ఈ సందర్భంగా వారు పిలుపు నిచ్చారు. ప్రతి ఒక్కరు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములు కావాలని కోరారు.
ఇదీ చదవండి:టిక్రీ సరిహద్దులో మరో రైతు ఆత్మహత్య