మూడు రోజులపాటు రాష్ట్రంలో అక్కడక్కడ ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. శనివారం ఆదిలాబాద్, నిర్మల్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లి , జయశంకర్ భూపాలపల్లి , ములుగు, వరంగల్-పట్టణ, వరంగల్-గ్రామీణ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ఖమ్మం జిల్లాలలో అక్కడక్కడా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది.
మూడు రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు...
రాష్ట్రంలో మూడు రోజుల పాటు అక్కడక్కడ ఉరుములు మెరుపులతోపాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈరోజు పలు జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది.
telangana weather update news
ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒరిస్సా తీరాలకు దగ్గరలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం... దాన్ని ఆనుకొని ఉన్న వాయువ్య బంగాళాఖాతం ప్రాంతాల్లో 7.6 km ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని వాతావరణ కేంద్రం విడుదల చేసిన ప్రకటనలో వివరించింది. ఇది ఎత్తుకు వెళ్లేకొద్దీ నైఋతి దిశ వైపుకు వంపు తిరిగి ఉందని అధికారులు పేర్కొన్నారు.