తెలంగాణ

telangana

ETV Bharat / state

TS weather Report: బయటకు వెళ్తున్నారా..? అయితే గొడుగు తప్పనిసరి!

రాష్ట్రంలోరాగల మూడు రోజుల పాటు తేలికపాటి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. పశ్చిమ దిశ నుంచి కిందిస్థాయి గాలులు వీయడమే ఇందుకు కారణమని తెలిపింది.

telangana weather report
telangana weather report

By

Published : Aug 3, 2021, 3:29 PM IST

తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు (RAINS) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (HYDERABAD WEATHER CENTER) ప్రకటించింది. ఈరోజు రాష్ట్రంలోకి పశ్చిమ దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తున్నాయని తెలిసింది. దీని ఫలితంగా నేడు, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.

గత నెలలో కురిసిన వర్షాలకు రాష్ట్రం చిగురాకుల వణికింది. పలు చోట్ల వరదలు ముంచెత్తాయి. జిల్లాల్లో చాలా ప్రాంతాల్లో పంటలు నీట మునిగాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు. భారీ వర్షాలకు చాలాచోట్ల చెరువులు, వాగులు పొంగిపొర్లాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆనకట్టలు తెగి పలు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. తప్పనిసరి పరిస్థితుల్లో పలుచోట్ల ప్రజలు ప్రమాదకర స్థితిలోనూ ప్రయాణం సాగించారు. వరదల్లో చిక్కుకున్న పలువురు బాధితులను రెస్క్యూ బృందాలు సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు.

మరికొన్ని చోట్ల... రోడ్లు తెగిపోయాయి. వరద నీరు రోడ్లపై ఉద్ధృతంగా ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు సైతం నిలిచిపోయాయి. ముంపులో ఉన్న గ్రామ ప్రజలకు అధికారులు సహాయ చర్యలు అందించారు. విద్యుత్​కు అంతరాయం ఏర్పడింది. వారం రోజులుగా వర్షాలు తగ్గడంతో... ఇప్పుడిప్పుడే వరద తగ్గుతుంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయాలకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది.

మరోవైపు ఏకధాటిగా కురిసిన వర్షాలకు ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. ఫలితంగా జలాశయాలన్నీ నిండుకుండల్లా దర్శనమిస్తున్నాయి. పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details