బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో ఒడిశా, పశ్చిమ బంగ తీరాల సమీపంలో ఆదివారం అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్లు ఎత్తున ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో సోమ, మంగళవారాల్లో ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ అధికారి రాజారావు తెలిపారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం... ఇవాళ, రేపు వర్షాలు - weather
రాష్ట్ర వ్యాప్తంగా సోమ, మంగళవారాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని దీని ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణ అధికారులు వెల్లడించారు.
ఆదివారం రాష్ట్రంలో అత్యధికంగా రామగుండంలో 31.8 డిగ్రీలు, అత్యల్పంగా రామగుండంలో 26, హైదరాబాద్ 23.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్‌లో సాధారణం కన్నా 4 డిగ్రీల తక్కువ ఉష్ణోగ్రత కారణంగా చలి వాతావరణం ఏర్పడింది. మహబూబ్‌నగర్ జల్లా బండర్‌పల్లి వాగుపై నిర్మించిన చెక్ డ్యాం జలకళ సంతరించుకుంది. వరద నీళ్లు పరవళ్ళు తోక్కడంతో రహదారిపై వెళ్లే ప్రయాణికులను ఆకర్షిస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో 3 రోజులుగా ఈదుర గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఇదీ చదవండి:మిడతల దాడులను 'ప్రకృతి విపత్తు'గా ప్రకటించాలి: కాంగ్రెస్