Voter List Revision Program Telangana : శాసనసభ ఎన్నికల(Telangana Assembly Elections) కోసం రాష్ట్రంలో ఓటర్ల జాబితా(Voters List) సవరణ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రతి ఏటా ఒక విడత ప్రత్యేక సవరణ కార్యక్రమాన్ని చేపడుతుండగా.. అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడాదిలో రెండో విడత కూడా చేపట్టారు. రెండో విడత ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా ఆగస్టు 21వ తేదీన ఓటర్ల జాబితా(Voter List Process in Telangana) ముసాయిదాను ప్రకటించారు.
Total Number of Voters in Telangana : ముసాయిదా ప్రకారం రాష్ట్రంలో మొత్తం ఓటర్ల సంఖ్య మూడు కోట్లా ఆరు లక్షల 26 వేల 996గా ఉంది. అందులో పురుషులు కోటి 53 లక్షల 73 వేల 66 మంది.. మహిళలు కోటి 52 లక్షల 51 వేల 797 మంది ఓటర్లు ఉన్నారు. 2,133 మంది ఇతరుల పేర్లు ముసాయిదా జాబితాలో ఉన్నాయి. ముసాయిదాపై ఆ రోజు నుంచి వినతులు, అభ్యంతరాలను స్వీకరిస్తారు. ముసాయిదా ప్రకటన వరకు అధికారుల వద్ద లక్షా 91 వేలకు పైగా దరఖాస్తులు పెండింగ్(Applications Pending)లో ఉన్నాయి. వాటిని కలిపితే ఇప్పటి వరకు మొత్తం 18 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. అందులో కొత్తగా ఓటుహక్కు నమోదు కోసం వచ్చిన దరఖాస్తుల సంఖ్య తొమ్మిది లక్షలకు పైగా ఉంది.
Voter list Process in TS : మరో దఫా ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ చేపట్టిన ఈసీ
Telangana Voter List 2023 :జాబితాలో పేర్ల తొలగింపునకు సంబంధించి మూడున్నర లక్షల వరకు దరఖాస్తులు అందాయి. ఇక చిరునామా మార్పు, ఓటర్లు బదలాయింపు, సవరణలకు సంబంధించి ఐదున్నర లక్షల వరకు దరఖాస్తులు వచ్చాయి. వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేలా అధికారులు ఇప్పటికే కసరత్తు కొనసాగిస్తున్నారు. ప్రత్యేక సవరణ ప్రక్రియలో భాగంగా వినతులు, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఇవాళ్టితో ముగియనుంది.