Transco CMD: ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ సంక్షోభం తలెత్తలేదని ట్రాన్స్కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు అన్నారు. ఎర్రగడ్డలోని జీటీఎస్ కాలనీలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాల ప్రాంగణంలో ఏర్పాటుచేసిన విద్యుత్ దీపాల ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలను ఆవిష్కరించారు.
Transco CMD: రాష్ట్రం ఏర్పడ్డాక విద్యుత్ సంక్షోభం తలెత్తలేదు: ప్రభాకర్ రావు - ఎర్రగడ్డలో విద్యుత్ ఉద్యోగులు
Transco CMD: రాష్టంలో విద్యుత్ సంక్షోభం లేదని ట్రాన్స్కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు తెలిపారు. హైదరాబాద్లోని ఎర్రగడ్డలో విద్యుత్ ఉద్యోగులు ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాల ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ట్రాన్స్కో-జెన్కో సీఎండీ ప్రభాకర్ రావు
విద్యుత్ లేకుండా మన నిత్య జీవితంలో ఒక్క రోజు కూడా గడవదని ప్రభాకర్ రావు అన్నారు. ఉద్యోగాలు ఇలాంటి సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం సంతోషకర విషయమని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సేవా కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు గణేశ్ రావు, సత్యనారాయణ పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి: