తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @1PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

telangana top ten telugu news
టాప్​టెన్​ న్యూస్​ @1PM

By

Published : Feb 22, 2022, 12:59 PM IST

  • నెల్లూరుకు గౌతమ్‌రెడ్డి భౌతికకాయం

గుండెపోటుతో హఠాన్మరణం చెందిన రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి భౌతికకాయం నెల్లూరు చేరుకుంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ నివాసం నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టుకు.. అక్కడి నుంచి ఎయిర్‌ అంబులెన్స్‌లో నెల్లూరు పరేడ్‌ గ్రౌండ్స్‌కు తీసుకొచ్చారు.

  • పగబట్టిన పాము.. 6 సార్లు కాటేసింది.!

పాము పగబడితే ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూశాం. కానీ నిజ జీవితంలోనూ అలా జరుగుతుందా అంటే చెప్పలేము. కొందరు ఇవన్నీ మూఢ నమ్మకాలు అని కొట్టిపారేస్తారు. మరికొందరు దోషమేదైనా ఉందేమోనని దోష నివారణ పూజలు చేయిస్తారు. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఓ కుటుంబాన్ని పాము కాటేసిన తీరు చూస్తుంటే మాత్రం వారిపై పగబట్టిందా అనే సందేహం రాక మాత్రం మానదు. ఇంట్లో ఉన్న ముగ్గురు కుటుంబ సభ్యులను ఒక నెలలో ఆరు సార్లు కాటేసింది. సకాలంలో స్థానికులు స్పందించి ఆస్పత్రికి తరలించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.

  • అలరిస్తున్న బ్యాండ్‌ నవరస ప్రదర్శనలు

మ్యూజిక్‌...! ఈ కళలో రాణించాలనే తపన ఉన్నా..అవకాశాలు రాక.. ప్రయత్నం ఆపినా వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇదంతా ఒకప్పుడు. సోషల్‌ మీడియా యుగంలో అవకాశాలు ఎవరూ ఇవ్వరు. మనమే సృష్టించుకోవాలి. అలా.. యువ మ్యుజీషియన్లు అంతా ఓ బృందంగా ఏర్పడి... తమ ప్రతిభను నలువైపులా చాటుతున్నారు. క్లాస్‌కు మాస్‌ను జత చేస్తూ...కుర్రకారును ఉర్రూతలు ఊగిస్తున్నారు. బ్యాండ్‌ నవరస పేరుతో... నవరసాలు పలికిస్తోంది ఓ యువబృందం.

  • తల్లిపాలు ఎంతో.. అమ్మ భాష అంతే

మాతృభాషలో ప్రావీణ్యం ఉన్న వారే ఇతర భాషల్ని వేగంగా నేర్చుకోగలరని ‘ఈనాడు’ ఆంధ్రప్రదేశ్‌ ఎడిటర్‌ ఎం.నాగేశ్వరరావు తెలిపారు. బిడ్డకు తల్లిపాలు ఎంతో, మనిషికి అమ్మ భాష అంతే.. మనం ఎంత చదువుకున్నా.. మనకు ఎన్ని భాషలు వచ్చినా మాతృభాషలోనే ఆలోచిస్తామన్నారు. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయం సోమవారం నిర్వహించిన వర్చువల్‌ వెబినార్‌కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

  • పగబట్టిన కాకులు.. మనుషులపై దాడి!

Crow Attack: ఆ ఊరి ప్రజలు కాకి పేరు చెబితేనే గజగజ వణికిపోతున్నారు. మూడున్నర నెలల క్రితం ప్రారంభమైన సమస్యతో నిత్యం సతమతం అవుతున్నారు. చేతిలో కర్ర, తలకు హెల్మెట్‌ లేనిదే అడుగు బయటకు పెట్టలేకపోతున్నారు. అసలు ఆ గ్రామం ఎక్కడుంది? ఆ ఊరి ప్రజల సమస్యేంటీ ఈ కథనంలో తెలుసుకుందాం.

  • డీజిల్​ ధర పెంపు.. ఆర్టీసీ ఎండీ కీలక ఆదేశాలు!

నిత్యం లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగించే ఏపీఎస్​ ఆర్టీసీకి.. చమురు సంస్థలు బయటి మార్కెట్‌ కంటే తక్కువ ధరకు సరఫరా చేస్తుంటాయి. కానీ గత వారం పదిరోజులుగా బయట విక్రయించే ధర కంటే ఆర్టీసీకి ఇచ్చే ధర లీటర్‌కు రూ.4.30 వరకు చమురు సంస్థలు పెంచేశాయి. దీంతో ఆర్టీసీపై భారం పెరగడంతో.. అన్ని బస్సులకూ బయటి బంకుల్లో డీజిల్‌ నింపుకోవాలంటూ ఏపీఎస్​ ఆర్టీసీ ఎండీ ఉత్తర్వులు జారీ చేశారు.

  • తోడబుట్టిన గుర్రం కోసం రోడ్డుపై 8కి.మీ పరుగు

మనుషుల మధ్యే కాదు జంతువుల మధ్య కూడా భావోద్వేగాలు ఉంటాయనడానికి ఈ దృశ్యాలే నిదర్శనం. తోడబుట్టిన గుర్రం అంబులెన్సులో వెళ్తుండటం చూసి.. మరో అశ్వం దాన్ని ఫాలో అయ్యింది. రోడ్డుపై 8కి.మీ ఆగకుండా పరుగెత్తింది. చివరకు అంబులెన్సు ఆస్పత్రిలో ఆగాక సోదరిని చూసి శాంతించింది. రాజస్థాన్ ఉదయ్​పుర్​లో అనారోగ్యానికి గురైన ఓ గుర్రాన్ని జంతు సంరక్షణ కేంద్రంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా.. ఈ ఘటన జరిగింది.

  • మైనర్​పై సామూహిక అత్యాచారం

Gang Rape on minor: హైదరాబాద్​లో ఓ మైనర్​పై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాయమాటలు చెప్పి మిత్రుని గదిలోకి తీసుకెళ్లిన యువకులు.. అనంతరం ఆఘాయిత్యానికి పాల్పడ్డారు.

  • అతడి కెరీర్​ను నాశనం చేయాలనుకోవట్లేదు

భారత క్రికెట్​లో టీమ్‌ఇండియా సీనియర్‌ వికెట్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహా ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారాడు. ఇటీవలే తనను ఓ జర్నలిస్ట్​ బెదరించాడంటూ ఓ వాట్సాప్​ స్క్రీన్​షాట్​ను షేర్​ చేశాడు. ఈ విషయం తీవ్ర దుమారం రేపడం వల్ల బీసీసీఐ రంగంలోకి దిగి దర్యాప్తు ప్రారంభించింది. అయితే తాజాగా దీనిపై స్పందించాడు సాహా. తనను బెదిరించిన జర్నలిస్టు గురించి బోర్డు అడిగితే పేరు చెప్పనని తెలిపాడు.

  • 'రాధేశ్యామ్'​కు బిగ్​బీ వాయిస్​ఓవర్

ప్రభాస్​ నటించిన 'రాధేశ్యామ్'​కు బాలీవుడ్​ దిగ్గజ నటుడు అమితాబ్​ బచ్చన్​ వాయిస్​ ఓవర్​ ఇచ్చారు. ఈ విషయాన్ని తెలియజేసిన చిత్రబృందం బిగ్​బీకి కృతజ్ఞతలు తెలిపింది. ఈ మూవీ మార్చి 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. రాధాకృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పూజాహెగ్డే హీరోయిన్​గా నటించింది.

ABOUT THE AUTHOR

...view details