ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుఉక్రెయిన్లో చిక్కుకున్న కరీంనగర్ విద్యార్థులు Telangana Students in Ukraine: ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కరీంనగర్‌కు చెందిన విద్యార్థులు సాయం కోసం భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఫోన్ చేశారు. ప్రస్తుతం 20 మంది ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకున్నట్లు సంజయ్‌కు వివరించారు. స్పందించిన సంజయ్ వెంటనే విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారు. విద్యార్థులను భారత్‌కు రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.భారత్ మద్దతు కోరుతున్నాంRussia Ukraine crisis: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రకటించింది. అన్ని వైపుల నుంచి దాడి చేస్తోంది. ఈ క్రమంలో భారత్ మద్దతు కోరింది ఉక్రెయిన్. ఆ దేశ సార్వభౌమత్వాన్ని కాపాడేందుకు భారత్ మద్దతు ఇవ్వాలని కోరారు భారత్‌లో ఆదేశ రాయబారి ఇగోర్ పొలిఖా. సంక్షోభ పరిష్కారానికి భారత ప్రధాని ముందుకు రావాలన్నారు.మన ఊరు-మన పోరు Congress Mana Ooru Mana Poru: తెలంగాణలో ఈ నెల 26 నుంచి "మన ఊరు - మన పోరు" సభలు నిర్వహించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు జూమ్ యాప్ ద్వారా సమావేశమైన పీసీసీ కార్యవర్గం పలు అంశాలపై చర్చించింది.దెబ్బతిన్న మొగిలయ్య కిన్నెరMogilaiah Kinnera Damage : 12 మెట్ల కిన్నెర వాద్యంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పద్మశ్రీ కిన్నెర మొగిలయ్యకు భీమ్లానాయక్ ప్రిరిలీజ్ ఈవెంట్లో చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాయించే కిన్నెర... పవన్ అభిమానుల తాకిడికి స్వల్పంగా దెబ్బతింది.విపక్షాల ఆందోళన Aler Protest: మహబూబాబాద్ జిల్లా ఆలేరులో వామపక్షాలు ఆందోళన చేపట్టాయి. అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న యువతి కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశాయి.విపక్షాలకు ఆ ధైర్యం లేదుUP Election 2022: యూపీలో జరిగిన తొలి నాలుగు దశ ఎన్నికల్లో ఓటర్లు భాజపా వైపే ఉన్నారని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఓట్ల విభజనలో విపక్షాల లెక్క తప్పిందన్నారు. ఈ క్రమంలోనే కుటుంబ పార్టీలపై విమర్శలు గుప్పించారు.కుప్పకూలిన 1.32 లక్షల హైఓల్టేజీ టవర్ Snowfall in Jammu and Kashmir: జమ్ముకశ్మీర్‌లో భారీగా కురుస్తున్న మంచు వల్ల జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. హిమపాతం కారణంగా 1.32 లక్షల హైఓల్టేజీ టవర్ కూలి.. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది.వార్ ఎఫెక్ట్.. మార్కెట్లు ఢమాల్Stock Market Close: ఉక్రెయిన్- రష్యా యుద్ధంతో దేశీయ స్టాక్ మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ ఏకంగా 2,700 పాయింట్లకుపైగా పతనమైంది. నిఫ్టీ 815 పాయింట్లు కోల్పోయింది.కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు: పవన్ 'భీమ్లా నాయక్' ప్రీ రిలీజ్‌కు హాజరైన తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు కథానాయకుడు పవన్ కల్యాణ్. కళకు ఎలాంటి బేధాలు లేవని ఆయన నిరూపించారని అన్నారు.కెప్టెన్‌గా అందుకే తప్పుకొన్నాVirat Kohli: టీమ్ఇండియా కెప్టెన్‌గా అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకోవడం సహా ఐపీఎల్లో బెంగళూరు జట్టు సారథ్య బాధ్యతలను వదిలేసుకున్నాడు కోహ్లీ. దీనిపై అభిమానుల్లో చాలా ఊహాగానాలు వెలువడ్డాయి. వీటిపై 'ది ఆర్సీబీ పాడ్‌కాస్ట్'లో మాట్లాడుతూ విరాట్ వివరణ ఇచ్చాడు. ఆస్వాదించలేనప్పుడు తాను ఏ పనినీ చేయనని అన్నాడు.