ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలుదేశాన్ని సరైన మార్గంలో పెడతా CM KCR on National Politics: భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కర్ణాటకలో మతకల్లోలం సృష్టించారని సీఎం కేసీఆర్ విమర్శించారు. కులాలు, మతాల పేరిట చిచ్చుపెట్టడం మంచిదికాదని హితవు పలికారు. కేంద్రంలో ధర్మంతో పనిచేసే ప్రభుత్వం ఉండాలని... జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసేలా ముందుకెళ్తున్నామన్నారు. చివరి రక్తంబొట్టు ధారపోసైనా దేశాన్ని సరైన మార్గంలో పెడతానని స్పష్టం చేశారు.మల్లన్నకు అభిషేకం చేసిన కేసీఆర్CM KCR visited Komuravelli Mallanna temple: కొమురవెల్లి మల్లన్నను సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. సిద్దిపేట జిల్లా మల్లన్న సాగర్ ప్రాజెక్టును ప్రారంభించిన అనంతరం.. కేసీఆర్ కొమురవెల్లి ఆలయానికి చేరుకున్నారు. గోదావరి జలాలతో మల్లన్నకు అభిషేకం చేశారు.మేడారం కానుకల లెక్కింపు Medaram Hundi Counting : మేడారం జాతర ఘనంగా ముగిసింది. వనదేవతలు జనానికి దర్శనమిచ్చి వన ప్రవేశం చేశారు. అమ్మవార్లను దర్శించుకోడానికి వచ్చిన భక్తులు తిరిగి ఇళ్లకు బయలుదేరుతున్నారు. మరోవైపు మేడారం మహా జాతర కానుకల లెక్కింపు ప్రారంభమైంది.వైతెపాకు ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్EC Green Signal to YSRTP: వైఎస్సార్ తెలంగాణ పార్టీకి ఎన్నికల కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందోత్సాహం నెలకొంది. హైదరాబాద్ లోటస్ పాండ్‌లోని పార్టీ కార్యాలయంలో.. అధ్యక్షురాలు షర్మిలకు శుభాకాంక్షలు తెలియజేసి సంబరాలు చేసుకున్నారు.మోదీతో క్షమాపణ చెప్పించాలి Minister Prashanth Reddy Comments: తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఖండించారు. తెలంగాణ ప్రజలకు మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ అరెస్ట్'ముంబయి అండర్‌వరల్డ్ వ్యవహారాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. అంతకుముందు అక్రమ నగదు లావాదేవీల నిరోధక చట్టం కింద నవాబ్ మాలిక్ వాంగ్మూలాన్ని నమోదుచేసినట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో మరో ఇద్దరు Bajrang Dal activist murder case: కర్ణాటకలో జరిగిన బజరంగ్ దళ్ కార్యకర్త హత్య కేసులో మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే శివమొగ్గ పరిధిలో అమల్లో ఉన్న 144 సెక్షన్‌ను మరో రెండు రోజు పాటు పొడిగించారు.మంచులో నాన్‌స్టాప్‌గా 65 పుష్అప్స్ITBP Commandant push-ups: ఐటీబీపీ కమాండెంట్ రతన్ సింగ్ సోనాల్ పెద్ద సాహసం చేశారు. మైనస్ 30 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద.. ఒకేసారి 65 పుష్అప్స్ తీసి ఔరా అనిపించుకున్నారీ 55 ఏళ్ల వ్యక్తి. అదీ.. శీతల ప్రాంతమైన లద్దాఖ్‌లో 17 వేల 500 అడుగుల ఎత్తులో చేయడం విశేషం. ఫిబ్రవరి 20న ఎత్తయిన కర్జోక్ కంగ్రీ పర్వతాన్ని చేరుకున్న ఈ ఐటీబీపీ బృందం.. గడ్డ కట్టే చలిలోనూ పోరాటపటిమను ప్రదర్శిస్తోంది.దుమ్ములేపిన సూర్యకుమార్, వెంకటేశ్ అయ్యర్ ICC T20I Rankings: ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ఆల్‌రౌండర్లు సూర్యకుమార్ యాదవ్, వెంకటేశ్ అయ్యర్ సత్తాచాటారు. జాబితాలో అమాంతం పైకి దూసుకొచ్చారు. వారితో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల ర్యాంకులు ఎలా ఉన్నాయంటే?నానికి బర్త్‌డే గిఫ్ట్..సినీ అప్డేట్స్ వచ్చేశాయి. ఇందులో అంటే సుందరానికి, ఆడవాళ్లు మీకు జోహార్లు, దొంగలున్నారు జాగ్రత్త, నేను మీకు బాగా కావాల్సినవాడిని, ఝండ్ సినిమాలతో పాటు ద గ్రేట్ ఇండియన్ కిచెన్ హిందీ రీమేక్‌కు సంబంధించిన విశేషాలు ఉన్నాయి.