తెలంగాణ

telangana

ETV Bharat / state

TOP TEN NEWS: టాప్‌టెన్ న్యూస్@3PM - Telangana top ten news

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

TOP TEN NEWS
TOP TEN NEWS

By

Published : Feb 22, 2022, 2:59 PM IST

  • భాజపా కార్పొరేటర్ల ధర్నా

BJP Corporators protest at Jalamandali : హైదరాబాద్ జలమండలి కార్యాలయం ఎదుట భాజపా కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. జలమండలికి రూ.500 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బందోబస్తు నిర్వహించారు.

  • భక్తుల మధ్యే రాములోరి కల్యాణం

Sri Rama Navami in Bhadradri: భక్తులంతా ఏడాదికొకసారి ఎంతో భక్తిభావంతో ఎదురుచూసే సీతారాముల కల్యాణ మహోత్సవం, బ్రహ్మోత్సవాలకు ముహూర్తం, తేదీలు ఖరారయ్యాయి. భద్రాద్రి వేదికగా జరిగే ఈ వేడుకల్లో సీతాసమేత రామయ్య కల్యాణాన్ని వీక్షించి యావత్​ భక్తజనం పులకరింతకు లోనవుతుంది. మనసంతా పరవశంతో నిండి.. వారిలాగే ఆదర్శ దంపతుల్లా జీవించే వరాన్ని ప్రసాదించమంటూ నూతన దంపతులు కోరుకుంటారు. కానీ కొవిడ్​ కారణంగా గత రెండేళ్లుగా రాములోరి కల్యాణం అంతరంగికంగా జరగడంతో భక్తులు కొంచెం నిరాశకు గుర్యయారు. ఈ ఏడాది మాత్రం భక్తులకు శుభవార్త అందించింది ఆలయ అధికారులు.

  • 'సర్వదర్శన' కష్టాలు..

Devotees suffering in Tirumala: తిరుమల శ్రీవారి దర్శనానికి వస్తున్న భక్తులకు.. తితిదే చుక్కలు చూపిస్తోంది. నేరుగా సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నామన్న ప్రకటనతో తిరుమలకు వచ్చినవారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టోకెన్లు ఇచ్చిన మూణ్నాలుగు రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం కల్పిస్తుండటంతో భక్తులు దిక్కుతోచని స్థితిలో పడుతున్నారు.

  • వచ్చే 25ఏళ్లకు పునాది

PM Modi in manipur: మణిపుర్​లో గత ఐదేళ్లలో భాజపా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు వచ్చే 25 ఏళ్లకు పునాది వేశాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో తాము మరోసారి అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్​పై విమర్శలు చేశారు.

  • డేరా బాబాకు జడ్ ప్లస్ భద్రత

Dera Baba Z plus security: డేరా బాబాకు హరియాణా ప్రభుత్వం జడ్ ప్లస్ భద్రత కల్పించింది. సిక్కు ఉగ్రవాదుల నుంచి ఆయనకు ముప్పు ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది.

  • ఉక్రెయిన్​లో టెన్షన్​ టెన్షన్

Ukraine Indian Students: ఉక్రెయిన్​-రష్యా మధ్య యుద్ధమేఘాలు అలుముకుంటున్నాయి. దీంతో ఉక్రెయిన్​లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చే ప్రక్రియను ముమ్మరం చేసింది విదేశాంగ శాఖ. రెండు దేశాల మధ్య మరో నాలుగు విమానాలను ఆపరేట్ చేయనున్నట్లు తెలిపింది. మరోవైపు గుజరాత్​ వడోదరకు చెందిన ఓ యువతి పశ్చిమ ఉక్రెయిన్​ నుంచి స్వదేశానికి వచ్చింది.

  • మాది అభివృద్ధి మంత్రం

Yogi Adityanath ETV Bharat interview: ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈటీవీ భారత్​కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. యూపీలో భాజపా విజయావకాశాల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా విపక్ష సమాజ్​వాదీపై విరుచుకుపడ్డారు.

  • సామూహిక అత్యాచారం

Gang Rape on minor: హైదరాబాద్​లో ఓ మైనర్​పై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మాయమాటలు చెప్పి మిత్రుని గదిలోకి తీసుకెళ్లిన యువకులు.. అనంతరం ఆఘాయిత్యానికి పాల్పడ్డారు.

  • మరో రెండు విజయాలు

Chess champion Praggnanandhaa: ఆన్‌లైన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ ఎయిర్‌థింగ్స్‌ మాస్టర్స్‌లో భాగంగా సోమవారం ప్రపంచ నెం.1 చెస్‌ ఛాంపియన్‌ మాగ్నస్‌ కార్ల్‌సన్‌ను ఓడించిన భారత యువ కెరటం ప్రజ్ఞానంద తాజాగా మరో రెండు విజయాలు సాధించాడు. దీంతో అతడు 15 పాయింట్లతో 12వ స్థానంలో నిలిచాడు.

  • ఎవరీ 'గంగూబాయ్'..

Who is Gangubai kathiawadi: బాలీవుడ్​ హీరోయిన్​ ఆలియా భట్​ నటించిన 'గంగూబాయ్​ కతియావాడి' ప్రస్తుతం హాట్​టాపిక్​గా మారింది. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. ఈ నేపథ్యంలో గంగూబాయ్​ ఎవరు? ఆమె 'మాఫియా క్వీన్​'గా ఎలా మారింది? వంటి విషయాల సమాహారమే ఈ కథనం..

ABOUT THE AUTHOR

...view details