తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్ న్యూస్@3PM

ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​టెన్ న్యూస్@3PM
టాప్​టెన్ న్యూస్@3PM

By

Published : Jan 11, 2021, 3:00 PM IST

1. విద్యాసంస్థల పునఃప్రారంభం

మంత్రులు, కలెక్టర్లతో సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. ఫిబ్రవరి నుంచి విద్యాసంస్థలు పునఃప్రారంభంకానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. రైతు బంధు సాయం

రైతు బంధు సాయం కింద రూ.7351.74 కోట్లు పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి తెలిపారు. 59 లక్షల 15వేల 905 మంది కర్షకులకు చెందిన కోటీ 47 లక్షల 3వేల ఎకరాలకు సాయం అందిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ప్రతి ఆటోలో క్యూ ఆర్​ కోడ్

రాష్ట్రంలో నేరాలు పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని అరికట్టేందుకు పోలీసు యంత్రాంగం.. సాంకేతికతను ఉపయోగించుకుని నేరాలను అదుపు చేసేలా చర్యలు తీసుకుంటోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. డ్రగ్స్​ కేసు

ఇటీవలే మధ్యప్రదేశ్​లో భారీగా పట్టుబడ్డ మాదకద్రవ్యాల కేసులో ప్రధాన నిందితుడు హైదరాబాద్ వాసి వేద్​ప్రకాశ్ వ్యాస్​ను ఇందోర్ పోలీసులు నగరానికి తీసుకువచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. మేమే చేయాలా?

నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతుల, ప్రభుత్వం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన విషయంలో కేంద్రం ప్రవర్తిస్తున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. జననాంగంపై దాడి

సభ్యసమాజం తలదించుకునే దారుణ ఘటన మధ్యప్రదేశ్​లోని సిద్ధిలో జరిగింది. ఒంటరిగా ఉన్న వితంతువుపై ముగ్గురు మానవమృగాలుగా మారి ఆటవికంగా సామూహిక అత్యాచారం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. దిల్లీకి బర్డ్​ ఫ్లూ

వేలాది పక్షుల మరణానికి కారణమైన బర్డ్​ ఫ్లూ.. దిల్లీకీ వ్యాపించింది. భోపాల్‌ ల్యాబ్​కు పంపిన ఎనిమిది నమూనాలను పరీక్షించిగా.. బర్డ్​ ఫ్లూ ఉన్నట్లు తేలింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. తగ్గిన ఉగ్రదాడులు

జమ్ముకశ్మీర్​లో ఉగ్రదాడులు తగ్గాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతకుముందు ఏడాదితో పోల్చుకుంటే 2020లో ఉగ్రదాడులతో పాటు ప్రత్యేక బలగాల, దేశ పౌరుల మరణాలు తగ్గాయని హోంశాఖ వార్షిక నివేదికలో పేర్కొంది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. అందాల విందు

సినిమాల్లో కొత్త అమ్మాయిలను హీరోయిన్లుగా ఎంచుకుంటే ఫ్రెష్‌లుక్‌ వస్తుందని ఆలోచిస్తుంటారు దర్శక నిర్మాతలు. అందుకే ఏటా కొత్త తారలు తళుక్కుమంటుంటారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. ఆసీస్ బౌలర్లకు చుక్కలు

ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టెస్టులో టీమ్ఇండియా బ్యాట్స్​మెన్ ఆస్ట్రేలియా బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టారు. దుర్భేద్యమైన ఆసీస్ బౌలింగ్​ను ఎదుర్కొని నిలబడి మ్యాచ్​ను డ్రాగా ముగించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details