తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7PM

ఇప్పటివరకు ఉన్న ప్రధానవార్తలు

Telangana Top News
టాప్​న్యూస్ @7PM

By

Published : Aug 5, 2022, 7:01 PM IST

  • నెక్ట్స్‌ సీఎం అభ్యర్థి మీరేనా..?

Ask Ktr: తెరాస కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తాజాగా ట్విటర్‌ వేదికగా నెటిజన్లతో ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. రాజకీయ, అభివృద్ధి, తదితర అంశాలపై పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు.

  • కాంగ్రెస్‌కు మునుపటి వైభవం వచ్చేనా?

TCongress: కాంగ్రెస్‌ కంచుకోటలాంటి నల్గొండ జిల్లాలో కీలక నేత కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడటంతో.. ఆ పార్టీ నేతలు నష్టనివారణ చర్యలు చేపట్టారు. అందులో భాగంగా మునుగోడులో క్యాడర్‌ చేజారిపోకుండా చర్యలు చేపట్టిన పార్టీ నాయకత్వం.. ఈరోజు నియోజకవర్గ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. మునుగోడులో మరోసారి కాంగ్రెస్‌ జెండాను ఎగరేయటమే లక్ష్యంగా హస్తం నేతలు పావులు కదుపుతున్నారు.

  • 60 గోమాతలు మృతి.. ఘటనపై యోగి సీరియస్​!

ఉత్తర్​ప్రదేశ్​ అమ్రోహ్​ జిల్లాలో విషాహారం తిని 60 ఆవులు మృతిచెందాయి. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ విచారణకు ఆదేశించారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టి.. నివేదిక ఇవ్వాలని అదనపు చీఫ్​ సెక్రటరీని ఆదేశించారు. పశుసంవర్ధక శాఖ మంత్రి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అస్వస్థతకు గురైన గోవులకు సరైన వైద్యసదుపాయాలు అందించాలని సూచించారు.

  • ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పరువు నష్టం దావా

Defamation: ఆంధ్రప్రదేశ్ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌పై తెదేపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ పాత్రుడు పరువు నష్టం దావా వేశారు. తనపై చేసిన ఆరోపణలు మాధవ్ నిరూపించాలని డిమాండ్ చేస్తూ.. రూ. 50లక్షల మేర పరువు నష్టం దావా వేశారు. ఈ మేరకు నోటీసులు పంపించారు. వారం రోజుల్లో తన నోటీసులకు సరైన స్పందన రాకుంటే.. న్యాయస్థానంలో తగు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని చింతకాయల విజయ్‌ పాత్రుడు నోటీసు ద్వారా హెచ్చరించారు.

  • బానిస బతుకు ఇష్టంలేకే కాంగ్రెస్‌కు రాజీనామా

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో షాక్‌. కాంగ్రెస్‌ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ప్రకటించి రెండు రోజులు గడవకముందే పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా మీడియా సమావేశంలో వెల్లడించారు.

  • నాలుగో అంతస్తు నుంచి కుమారుడ్ని తోసేసిన తల్లి..

అనారోగ్యంతో బాధపడుతున్న కుమారుడ్ని అపార్టు​మెంట్​ నాలుగో అంతస్తు నుంచి కిందకు తోసేసింది ఓ కన్నతల్లి. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే బాలుడు మృతి చెందాడు. ఈ విషాద ఘటన బెంగళూరులో జరిగింది. మరోవైపు, గుజరాత్​.. దాహోద్​ జిల్లాలో 40 అడుగుల లోతైన బావిలో ఓ నవజాత శిశువును గుర్తు తెలియని వ్యక్తులు పడేసి వెళ్లిపోయారు.

  • 'కరోనా నుంచి కోలుకున్నా.. కష్టంగానే!'

కరోనా బారిన పడిన ప్రతి ఎనిమిది మందిలో కనీసం ఒకరు లాంగ్‌ కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. నెదర్లాండ్స్​ పరిశోధకులు జరిపిన తాజా అధ్యయనం ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ 'ది లాన్సెట్‌'లో ప్రచురితమైంది.

  • అమెజాన్ 'ఫ్రీడమ్​ సేల్​'.. వాటిపై 75 శాతం వరకు డిస్కౌంట్​!

Amazon Great Freedom Festival Sale: అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ ఫెస్టివల్ సేల్‌ తేదీలు వచ్చేశాయి. ఆగస్టు నెలలో ఐదు రోజుల పాటు ఈ సూపర్​ సేల్‌ జరగనుంది. ఆ​ తేదీలతో పాటు ఏ కేటగిరీ ప్రొడక్టులపై ఎంత శాతం డిస్కౌంట్లు ఉండనున్నాయో అమెజాన్ వెల్లడించింది. ఆ వివరాలు తెలుసుకుందాం.

  • ఈ క్రికెటర్ల జెర్సీ నెంబర్ల వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

జెర్సీ నంబర్-10, నంబరు-7కు ఉన్న క్రేజ్​ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ నంబర్స్​ వినగానే అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది సచిన్​, ధోనీ. అయితే వాళ్లెందుకు ఆ నంబర్లను ఎంచుకున్నారు? ఇంకా ఏఏ క్రికెటర్లు ఏఏ నంబర్లతో ఆడుతున్నారు? ఎందుకు అవే నంబర్స్​ను ఎంచుకున్నారో తెలుసుకుందాం..

  • కల్యాణ్​రామ్​పై ఎన్టీఆర్​ ట్వీట్​.. అది ఇంకెవ్వరూ చేయలేరంటూ..

బింబిసార చిత్రంపై ప్రశంసలు ఎన్టీఆర్​ ప్రశంసలు కురిపించారు. 'బింబిసార' రాజు పాత్రకు తన సోదరుడు కల్యాణ్‌రామ్‌ తప్ప మరెవరూ సరైన న్యాయం చేయలేరని నటుడు ఎన్టీఆర్‌ అన్నారు. ప్రేక్షకుల నుంచి 'బింబిసార'కు వస్తోన్న స్పందనపై తాజాగా తారక్‌ ట్వీట్‌ చేశారు. ఈ సినిమాని తొలిసారి చూసినప్పుడు తామెలాంటి అనుభూతిని పొందామో.. ప్రేక్షకులూ అదే ఆనందాన్ని పొందుతున్నారని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details