తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

By

Published : Jun 21, 2022, 9:00 PM IST

Telangana Top News
టాప్​ న్యూస్ @9PM

  • భాజపా పార్లమెంటరీ బోర్డు భేటీ

రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై చర్చించేందుకు భాజపా పార్లమెంటరీ బోర్డు సమావేశమైంది. ఇందులో ప్రధాని నరేంద్ర మోదీ, జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజనాథ్ సింగ్, నితిన్ గడ్కరీ సభ్యులుగా ఉన్నారు.

  • రాష్ట్రంలో భారీగా పెరిగిన కరోనా కేసులు..

తెలంగాణ కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఈరోజు 26,704 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 403 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారి నుంచి ఇవాళ 145 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గత వారంతో పోలిస్తే ఇవాళ రెట్టింపు కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్యశాఖ వెల్లడించింది.

  • బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి మృతి

ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించిన ఎలుగుబంటి మృతి చెందింది. ఒకరిని చంపి పలువురిని తీవ్రంగా గాయపరిచిన భల్లూకం... బోన్‌లో విశాఖ జూకు తరలిస్తుండగా దారిలో మృతి చెందింది.

  • నిందితులకు బెయిల్‌ పిటిషన్‌పై రేపు వాదనలు

జూబ్లీహిల్స్‌ ఘటన నిందితులకు బెయిల్‌ పిటిషన్‌పై రేపు వాదనలు జరగనున్నాయి. నాంపల్లి కోర్టులో ప్రధాన నిందితుడు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. జువైనల్‌ జస్టిస్‌ బోర్డులో ఐదుగురు మైనర్లు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

  • రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకం..

Corporations Chairmans: మరో రెండు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్ కుర్మాచలం, రాష్ట్ర రెడ్కో ఛైర్మన్‌గా వై.సతీశ్ రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

  • కార్డుల జారీపై ఆర్బీఐ కీలక నిర్ణయం..

కార్డుల మంజూరు కోసం జారీ చేసిన మార్గదర్శకాలను మరో మూడు నెలల పాటు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. కస్టమర్ల అంగీకారం లేకుండా కొత్త కార్డులను యాక్టివేట్​ చేయవద్దనే ఉద్దేశంతో బ్యాంకులు, నాన్​ బ్యాంకింగ్​ ఫైనాన్స్​ సంస్థలకు గతంలో మార్గదర్శకాలను జారీ చేసింది ఆర్బీఐ. కొత్త నిబంధనలు జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని మార్గదర్శకాలు విడుదల చేసిన సందర్భంలో వెల్లడించింది.

  • ట్విట్టర్ 'డీల్'​ను ఆమోదించాలని వాటాదార్లను కోరిన బోర్డు

Elon Musk Twitter deal: ట్విట్టర్ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించాలని వాటాదారులను సంస్థ బోర్డు కోరింది. ఎలాన్ మస్క్​తో కుదుర్చుకున్న 44 బిలియన్ డాలర్ల ఒప్పందానికి అంగీకారం తెలపాలని విజ్ఞప్తి చేసింది.

  • 'ఆమె'గా మారిన ఎలాన్​ మస్క్ కుమారుడు

ELON MUSK: టెస్లా అధినేత కుమారుడు తన పేరును మార్చుకోనున్నారు. ఇప్పటికే లింగమార్పిడి చేసుకోగా తాజాగా ఆమెగా మారిన నేపథ్యంలో.. పేరును మార్చాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. తన తండ్రితో కలిసి జీవించకపోవడంతో పాటు ఆకారం లేదా ఇతర ఏ రూపంలోనూ ఆయనతో సంబంధం లేకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు ఎలన్​ మస్క్ కుమారుడు వెల్లడించారు.

  • పాత ల్యాప్​టాప్ కొంటున్నారా?

Used laptop test: సెకండ్ హ్యాండ్​లో కంప్యూటర్ లేదా ల్యాప్​టాప్ కొంటున్నారా? మరి కొనే ముందు ల్యాప్​టాప్​/ పీసీలో ఏమేం చెక్ చేయాలో తెలుసా? కొన్ని సింపుల్ టెస్టులు నిర్వహించి ల్యాప్​టాప్ పరిస్థితిపై ఓ అంచనాకు రావొచ్చు. అవేంటో చూసేయండి..

  • విజయ్66 ఫస్ట్​లుక్​ వచ్చేసింది.. టైటిల్​ ఇదే

Vijay Thalapathy 66 Movie First Look: వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో తలపతి విజయ్ నటిస్తున్న తలపతి66 ఫస్ట్​లుక్​ వచ్చేసింది. ఈ సినిమాకు 'వారిసు' (వారసుడు) అనే టైటిల్ ఖరారు చేశారు. పోస్టర్​లో సూట్​ వేసుకొని సీరియస్​ లుక్​ ఇస్తూ స్టైలిష్​గా ఉన్నారు విజయ్.

ABOUT THE AUTHOR

...view details