ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలునేటి నుంచే బడ్జెట్ సమావేశాలు రాష్ట్ర ఉభయసభలు ఇవాళ కొలువు తీరనున్నాయి. వార్షిక బడ్జెట్ ఆమోదం కోసం ఈరోజు నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. గత సమావేశాలకు కొనసాగింపుగా జరుగుతున్న తరుణంలో ఉభయసభల సభ్యులనుద్దేశించి ఈ మారు గవర్నర్ ప్రసంగం లేదు. నేరుగా బడ్జెట్ సమర్పణతోనే సమావేశాలు ప్రారంభం కానున్నాయి. మరోసారి భారీ బడ్జెట్రాష్ట్ర ప్రభుత్వం మరోమారు భారీ బడ్జెట్ ప్రవేశపెట్టేందుకు సిద్ధమైంది. గత రెండేళ్ల తరహాలోనే బడ్జెట్ అంచనాలు 20 శాతానికి పైగా పెరిగే అవకాశం ఉంది. పద్దు పరిమాణం 2.70 లక్షల కోట్లు దాటినట్లు సమాచారం. ఎప్పటి లాగే సంక్షేమం, వ్యవసాయానికి పెద్దపీట వేయడంతో పాటు హామీల అమలు, ప్రాధాన్యతా పథకాలకు సరిపడా నిధులు కేటాయించినట్లు తెలిసింది.తెలంగాణ ఘనతను చాటుదాం శాసనసభ వేదికగా తెలంగాణ ఘనతను, విజయాలను దేశమంతటికీ చాటిచెప్పాలని సీఎం కేసీఆర్ మంత్రులకు సూచించారు. ఎనిమిదేళ్ల స్వల్ప సమయంలోనే రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా నిలుస్తోందని, తెలంగాణ మాదిరే దేశం కూడా ఇదే స్థాయికి రావాలనే ఆకాంక్షను ప్రతీ ఒక్కరిలో కలగించాలన్నారు.జంట హత్యల నిందితుల కోసం గాలింపురంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం కర్ణంగూడ వద్ద జరిగిన జంటహత్యల కేసులో పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ఇప్పటికే ఆరుగురిని పోలీసులు అరెస్టు చేశారు.చివరి దశ పోలింగ్‌కు 'యూపీ' సిద్ధం ఉత్తరప్రదేశ్ శాసనసభ చివరి విడత పోలింగ్‌కు సర్వం సిద్ధమైంది. తొమ్మిది జిల్లాల్లో విస్తరించి ఉన్న 54 నియోజకవర్గాల్లో సోమవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గం వారణాశి పరిధిలోనూ ఈ విడతలోనే ఓటింగ్ జరగనుంది.ఆగని బాంబుల మోతరష్యా చేస్తున్న బాంబుల మోత, క్షిపణుల దాడులతో ఉక్రెయిన్ అల్లకల్లోలంగా మారింది. మాస్కో సేనలు ఉక్రెయిన్‌ను అన్నివిధాలా దిగ్భంధం చేస్తున్నాయి. ఎంత ప్రతిఘటన ఎదురైనా రష్యన్ బలగాలు ముందుకు వెళ్తూనే ఉన్నాయి. స్పెషల్ ఆపరేషన్ పేరుతో జరుపుతున్న దాడిని సమర్థించుకొంటోంది. అజిత్ పవార్ ఘాటు వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోదీ ముందే మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్... గవర్నర్ భగత్‌సింగ్ కోశ్యారీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కీలక పదవుల్లో ఉన్నవారు అనవసర వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ పేరు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. ఆ సమయంలో ప్రధాని మోదీ సహా గవర్నర్ కోశ్యారీ సైతం అదే వేదికపై ఉన్నారు.అమెరికాలో టోర్నడో బీభత్సంఅమెరికా అయోవా రాష్ట్రంలో టోర్నడో బీభత్సం సృష్టించింది. సుడిగుండాల ధాటికి ఇద్దరు చిన్నారులు సహా.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. మరో నలుగురు గాయపడినట్లు చెప్పారు. బలమైన టోర్నడో కారణంగా పలు భవనాలు దెబ్బతిన్నాయి.కోహ్లీ వందో టెస్టులో ఎన్ని రికార్డులో తెలుసా..? భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ వందో టెస్ట్ అనేక రికార్డులకు వేదికగా నిలిచింది. శ్రీలంక భారత్‌ల మధ్య జరిగిన టెస్ట్‌లో ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్‌లు అరుదైన రికార్డులను సృష్టించారు.'ఆర్ఆర్ఆర్' కోసం థియేటర్ బుక్మార్చి 25న 'ఆర్ఆర్ఆర్' చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ వీరాభిమాని ఒకరు.. ప్రీమియర్షో కోసం ఏకంగా థియేటర్‌నే బుక్‌చేశాడు. అమెరికా ఫ్లోరిడాలోని టెన్సిల్ నగరంలోని థియోటర్లో మొత్తం 75 టికెట్లను కొనుగోలు చేశాడు. ఈ టికెట్లను సామజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది.