తెలంగాణ

telangana

ETV Bharat / state

టాప్​టెన్​ న్యూస్​ @5PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు.

top-news
టాప్​టెన్​ న్యూస్​

By

Published : Apr 20, 2021, 5:00 PM IST

1. ఏడాదికి 70 కోట్ల డోసులు

కొవాగ్జిన్ టీకాల ఉత్పత్తి పెంచుతున్నట్లు ఉత్పత్తిదారు భారత్ బయోటెక్ ప్రకటించింది. ఏడాదికి 70 కోట్ల డోసులను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించింది. హైదరాబాద్, బెంగళూరులోని టీకా ఉత్పత్తి కేంద్రాల సామర్థ్యం బలోపేతానికి దశలవారిగా చర్యలు తీసుకుంటున్నట్లు సంస్థ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. వర్ష సూచన

రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'మీరెళ్లి కేటీఆర్​ను కలవడమేంటి'

భాజపా నేతలు కేటీఆర్‌ను కలవడంపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆగ్రహాం వ్యక్తం చేశారు. లింగోజీగూడ డివిజన్‌ ఏకగ్రీవం కోసం ఆపార్టీ నేతలు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ను కలిశారు. ఎందుకు కలవాల్సి వచ్చిందని త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. అటెన్షన్​ ప్లీజ్​

రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ నేపథ్యంలో హైదరాబాద్‌ మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. చివరి స్టేషన్ నుంచి రాత్రి 7.45 గంటల వరకే చివరి మెట్రో రైలు నడపనున్నట్లు ప్రకటించారు. అది గమ్యస్థానానికి 8.45 గంటలకు చేరుకుంటుందని తెలిపారు. నేటి నుంచి ఈనెల 30 వరకు అమల్లో ఉంటాయని వివరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రాహుల్​ గాంధీకి కరోనా..

దేశంలో కరోనా బారినపడుతున్న ప్రముఖుల జాబితా పెరుగుతూనే ఉంది. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు సోమవారం కోవిడ్ పాజిటివ్ నిర్ధరణ కాగా.. ఇవాళ కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీకి కరోనా సోకింది. ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించిన రాహుల్‌.. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నట్టు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. పోలింగ్​ కుదించాలి

కరోనా విజృంభణ దృష్ట్యా ఎన్నికల షెడ్యూల్​ను కుదించాలని బంగాల్ ఎన్నికల కమిషన్​కు తృణమూల్ కాంగ్రెస్​ వినతిపత్రాన్ని సమర్పించింది. సోమవారం.. బంగాల్​ సీఎం మమతా బెనర్జీ సైతం.. 6,7,8 దశల ఎన్నికలను ఒకే దశకు కుదించాలని ఈసీని కోరారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7.రెమ్​డెసివిర్​పై రాజకీయ రగడ

రెమ్​డెసివిర్​ ఔషధంపై భారతీయ జనతా పార్టీ జోక్యం చేసుకోవడం రాజకీయ దుమారం రేపుతోంది. ఔషధాన్ని నిల్వచేసి ఎగుమతి చేస్తోందనే ఆరోపణలతో బ్రూక్​ సంస్థపై ముంబయి పోలీసుల విచారణతో భాజపా, మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మధ్య తీవ్ర వివాదం చెలరేగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. మార్కెట్లపై ఆంక్షల భయం

స్టాక్ మార్కెట్లు మంగళవారం కూడా నష్టాలను నమోదు చేశాయి. సెన్సెక్స్ 244 పాయింట్లు తగ్గి.. 47,750 దిగువకు చేరింది. నిఫ్టీ 63 పాయింట్లు నష్టపోయి.. 14,300 మార్క్​ను కోల్పోయింది. ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆటో షేర్లు రాణించాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ఎనిమిదేళ్ల క్రితం ట్వీట్​... ఇప్పుడు వైరల్​

రాజస్థాన్ రాయల్స్​తో సోమవారం జరిగిన మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్​లో సీఎస్కే ఆల్​రౌండర్ జడేజా తన ఫీల్డింగ్​తో అద్భుతం చేశాడు. దీంతో అతడి ఫీల్డింగ్​పై ఎనిమిదేళ్ల క్రితం ధోనీ చేసిన ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. బద్రి ముచ్చట్లు

పవర్​స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'బద్రి'. ఈ సినిమాకు నేటితో 21 ఏళ్లు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన విశేషాలు చూద్దాం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details