1. భాజపా అభ్యర్థుల ప్రకటన
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు భాజపా అభ్యర్థులను ప్రకటించింది. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ అభ్యర్థిగా ఎన్.రాంచందర్‌రావు, వరంగల్-నల్గొండ-ఖమ్మం అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిని ఎంపిక చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
2. షెడ్యూల్ విడుదల
ఏపీలో మరో ఎన్నికలకు... ఎస్ఈసీ శంఖం పూరించింది. మున్సిపల్ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది. 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మార్చి 10న పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
3. రైతులకు స్వేచ్ఛ
లక్ష్య సాధనకు పార్టీ శ్రేణులు మరింత శ్రమించాలని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి సూచించారు. హైదరాబాద్ భాజపా సెంట్రల్ జిల్లా పదాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
4. విచారణకు సహకరిస్తా
కిడ్నాప్ కేసులో బోయిన్పల్లి పీఎస్‌కు భూమా అఖిలప్రియ హాజరయ్యారు. కోర్టు ఆదేశాలతో పోలీసులకు సహకరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఎవరితో ఎలాంటి సంప్రదింపులు జరపట్లేదని వెల్లడించారు.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
5. యాదాద్రి పుష్కరిణులు
యాదాద్రీశుని ఆలయ సన్నిధిలో ఉన్న విష్ణు పుష్కరిణిని రూ.4.01 కోట్ల వ్యయంతో పునరుద్ధరిస్తున్నారు. దైవ కార్యక్రమాల కోసం ఈ పుష్కరిణిని వినియోగించనున్నారు. కొండకింద భక్త జనుల పుణ్యస్నానాలకు ప్రత్యేకంగా లక్ష్మీ పుష్కరిణి నిర్మాణ పనులు జరుగుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.