తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @1PM - 1PM టాప్​న్యూస్

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1PM TOPNEWS
1PM TOPNEWS

By

Published : Dec 13, 2022, 12:58 PM IST

  • 'మన సైనికులెవరూ ప్రాణాలు కోల్పోలేదు'.. తవాంగ్ సెక్టార్​లో ఘర్షణపై రాజ్​నాథ్

భారత్-చైనా దళాల మధ్య జరిగిన తాజా ఘర్షణపై రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ లోక్​సభలో ప్రకటన చేశారు. చైనా దళాల దురాక్రమణను భారత సైన్యం సమర్థంగా అడ్డుకుందని చెప్పారు.

  • పట్టపగలే మహిళను గన్​తో బెదిరించి గొలుసు చోరీ చేసిన దొంగ

ఉత్తర్​ప్రదేశ్​లోని గాజియాబాద్​లో​ ఓ దొంగ పట్టపగలే రెచ్చిపోయాడు. రోడ్డుపై వెళ్తున్న ఓ మహిళను తుపాకీతో బెదిరించి గొలుసును కాజేశాడు. అక్కడే ఉన్న ఓ యువకుడు తనకు అడ్డు రావడం వల్ల అతడి వద్దనున్న మొబైల్​ ఫోన్​ను సైతం ఎత్తుకెళ్లాడు. దీనికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడే ఉన్న సీసీటీవీలో నమోదయ్యాయి.

  • దిల్లీలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు..

తెలంగాణ రాష్ట్ర సమితి... భారత్‌ రాష్ట్ర సమితిగా అవతరించిన అనంతరం వడివడిగా... దిల్లీలో పార్టీ కార్యాలయ ఏర్పాట్లు సాగుతున్నాయి. హస్తినలోనే ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్‌... రేపు భారాస కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. రాజశ్యామల యాగాన్ని నిర్వహించనున్నారు. దేశ వ్యాప్తంగా... భావసారూప్యత కలిగిన పార్టీల నేతలు, అభిమానులు, పెద్ద సంఖ్యలో హాజరుకున్నారు.

  • కౌన్‌బనేగా కరోడ్‌పతి పేరుతో ఎస్‌ఎంఎస్‌.. సొమ్మంతా మటాష్‌

సైబర్‌ నేరాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రోజూ ఏదో ఓ మూల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి జనం మోసపోతూనే ఉన్నారు. ఇదివరకు ఉద్యోగాలు, బహుమతి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం అంటూ సందేశాలు పంపి డబ్బులు కొట్టేసిన కేటుగాళ్లు.. ఇప్పుడు కౌన్​ బనేగా కరోడ్​పతి కార్యక్రమం పేరు చెప్పి జేబులు గుళ్ల చేస్తున్నారు.

  • ‘వారాహి’కి లైన్‌ క్లియర్‌.. రిజిస్ట్రేషన్‌ నెంబర్ ఎంతంటే..

Line Clear For Janasena Varahi Registration: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి వాహనానికి అన్ని అనుమతులు సక్రమంగా ఉన్నాయని రవాణాశాఖ డిప్యూటీ కమీషనర్ పాపారావు పేర్కొన్నారు. మెహదీపట్నం రవాణాశాఖ కార్యాలయంలో టీఎస్‌13ఈఎక్స్‌ 8384 తో వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆయన తెలిపారు.

  • పాజిటివ్​గా ఆలోచిద్దాం .. భయాన్ని వీడుదాం !

కొంతమంది విద్యార్థులు చదువంటే భయపడుతుంటారు. కాలేజీకి వెళ్లాలన్నా, తరగతుల్లో కూర్చోవాలన్నా, పరీక్షలన్నా తెలియని ఆందోళన వారిని ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా అప్పుడే కొత్త ఊరికి మారినవారు, అప్పటివరకూ ఒకచోట చదివి పెద్ద విద్యాసంస్థలకు వెళ్లినవారు, సబ్జెక్టు అంటే భయం ఉన్నవారిలో ఇటువంటి భావన సహజం.

  • మహిళ కడుపులో ఆరున్నర కేజీల కణితి.. నాలుగు గంటలు శ్రమించి తొలగించిన వైద్యులు

బంగాల్​లోని ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. ఓ మహిళ కడుపులో ఉన్న ఆరున్నర కేజీల కణితిని తొలగించారు.

  • మెస్సి రిటైర్మెంట్‌ అంటూ ప్రచారం.. ఈ సారి ప్రపంచకప్​ గెలుస్తాడా?

సాకర్‌ స్టార్‌ లియెనల్‌ మెస్సీ రిటైర్మెంట్​ ప్రకటించవచ్చు అని ప్రచారం సాగుతోంది. మరి అతడు ఈ సారి ప్రపంచకప్​ సాధిస్తాడా?

  • స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

దేశంలో బంగారం ధర స్వల్పంగా తగ్గగా, వెండి ధర పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?

  • NTR 30: తారక్​ రోల్​పై ఇంట్రెస్టింగ్​ అప్డేట్​.. ఎక్స్​ట్రా ఫింగర్ ఎలిమెంట్​తో

కొరటాల శివ-తారక్ కాంబినేషనల్​లో రూపొందుతున్న ఎన్టీఆర్ 30 గురించి ఓ అదిరిపోయే ఇంట్రెస్టింగ్ వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే..

ABOUT THE AUTHOR

...view details