తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Top News: టాప్​న్యూస్ @7AM - top ten news

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

టాప్​న్యూస్ @7AM
టాప్​న్యూస్ @7AM

By

Published : Dec 6, 2022, 6:44 AM IST

  • ఈ నెల 10న రాష్ట్ర కేబినెట్ సమావేశం

రాష్ట్ర కేబినెట్‌ భేటీకి ముహుర్తం ఫిక్స్ అయింది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ఈనెల 10న మ.2 గం.కు సమావేశం జరగనుంది. ధాన్యం కొనుగోళ్లు, రైతుబంధు నిధుల విడుదల, పలు అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

  • బీజేపీతో ఇక యుద్ధమే.. టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేసీఆర్ దిశానిర్దేశం

ముఖ్యమంత్రి కేసీఆర్‌తో టీఆర్ఎస్ ఎంపీలు సమావేశమయ్యారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలపై ఎంపీలకు కేసీఆర్‌ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రం, తెరాస తరఫున లేవనెత్తాల్సిన అంశాలపై ఎంపీలకు సూచించారు. దిల్లీ పరిణామాలపై సమావేశంలో చర్చించే అవకాశముందని తెలుస్తోంది.

  • హైదరాబాద్‌కు యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా గుర్తింపు తెస్తాం

చారిత్రక నేపథ్యం ఉన్న బన్సీలాల్‌పేట మెట్ల బావిని ప్రారంభించడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని... మంత్రి కేటీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ నగరాన్ని యునెస్కో గుర్తింపు ఉన్న చారిత్రక వారసత్వ నగరంగా తీర్చిదిద్దుతామని.. ఆయన పేర్కొన్నారు.

  • కాంగ్రెస్‌ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జ్‌..

కాంగ్రెస్‌ శ్రేణులపై పోలీసులు విరుచుకుపడ్డారు. కర్రలు విరిగేలా వారిపై లాఠీఛార్జ్‌ చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ ధర్నా ఈ ఘటన చోటుచేసుకుంది. అసలు ఏం జరిగిందంటే...

  • దేహదారుఢ్య పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన రాచకొండ సీపీ..

హైదరాబాద్​లోని సరూర్​నగర్ అవుట్ డోర్ స్టేడయంలో ఏర్పాటు చేసిన దేహదారుఢ్య పరీక్షా కేంద్రాన్ని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పరిశీలించారు. దేహదారుడ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్దులకి, ఫలితాలు అనుకూలంగా వచ్చేలా చేస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసేవారిని నమ్మవద్దని ఆయన హెచ్చరించారు.

  • గుజరాత్‌, హిమాచల్‌లో 2017 ఎగ్జిట్‌ పోల్స్‌ నిజమయ్యాయా?

గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు వెలువరిచాయి. ఈ నేపథ్యంలో గత ఎన్నికల్లో ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు నిజమయ్యాయా..? లేదా..? అనే విషయాన్ని ఓసారి గుర్తుచేసుకుందాం.

  • రూ.70 వేలు ఇచ్చి ప్రియురాలి హత్య..

పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేసిందని ప్రియురాలిని రూ.70 వేలు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు ఓ వ్యక్తి. ఈ ఘటన ఉత్తర్​ప్రదేశ్​లో జరిగింది. మరోవైపు, దివ్యాంగురాలిపై ముగ్గురు కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణం ఝార్ఖండ్​లో వెలుగుచూసింది.

  • వాట్సాప్‌లో LIC సేవల కోసం ఎలా రిజిస్టర్‌ అవ్వాలో తెలుసా?

పాలసీదారులకు మెరుగైన సేవలందించేందుకు ఓ వాట్సాప్‌ నంబర్‌ను LIC అందుబాటులోకి తెచ్చింది.దీని ద్వారా 10 రకాల సేవలు పొందొచ్చు. ఎలా అంటే..?

  • టీమ్ఇండియా​ నుంచి పంత్​ రిలీజ్​.. గాయమా?

టీమ్​ఇండియా వికెట్​ కీపర్​ రిషబ్​ పంత్​ను జట్టు నుంచి విడుదల చేశారు. ఈ మేరకు బీసీసీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే పంత్​ను టీమ్​ నుంచి రిలీజ్​ చేయడానికి ఓ కారణం ఉందని సమాచారం. అదేంటంటే..

  • రెడ్​ శారీలో పూజ హాట్​ లుక్స్​ బీచ్​లో ప్రియాంక సొగసులు..

తమ ఫోజులతో కుర్రకారును చూపుతిప్పకుండా చేస్తున్నారు ఈ తారలు. మెరిసే దుస్తుల్లో అందర్నీ కట్టిపడేస్తున్నారు. టాలీవుడ్​ అగ్ర కథానాయిక పూజా హెగ్డే రెడ్​​ శారీతో రొమాంటిక్​ లుక్స్​లో మత్తెక్కిస్తోంది. హిందీ భామలు కూడా మామూలుగా లేరుగా. ఇంకెందుకు ఆలస్యం ఓ సారి మీరూ చూసేయండి.

ABOUT THE AUTHOR

...view details