Telangana Tax Revenue November 2023 : అక్టోబర్‌తో పోలిస్తే నవంబర్‌లో రాష్ట్ర ఖజానాకు పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తగ్గింది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్- కాగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం ఈ మేరకు వివరాలు అందించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు ఆగస్టు నెలలో అత్యధికంగా రూ.12,729 కోట్ల పన్ను రాబడి వచ్చింది. అక్టోబర్‌లో రూ.10,691 కోట్లు రాగా నవంబర్‌లో రూ.9,701 కోట్లకు తగ్గింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెల అయిన ఏప్రిల్‌లో రూ.9,698 కోట్ల ఆదాయం వచ్చింది. 2022 నవంబర్‌లో రూ.10,726 కోట్ల ఆదాయం రాగా ఈ ఏడాది నవంబర్‌లో మాత్రం రాబడి తగ్గింది.
నెలల వారీగా రాష్ట్ర ఖజానాకు వచ్చిన పన్నుల రాబడి :
నెల | పన్నుల రాబడి(కోట్లలో) |
ఆగస్టు | 12,729 |
అక్టోబర్ | 10,691 |
నవంబర్ | 9,701 |
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సర్కార్ ఫోకస్ - శాసనసభ వేదికగా లెక్కతేల్చేందుకు సిద్ధం
Telangana Budget Details: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ నెల ముగిసే నాటికి రాష్ట్ర ఖజానాకు పన్నుల రూపం(Telangana Government November Collect Tax)లో వచ్చిన ఆదాయం రూ.87,083 కోట్లు. బడ్జెట్ అంచనా అయిన రూ.1,52,499 కోట్లలో ఇది 57 శాతానికిపైగా ఉంది. జీఎస్టీ ద్వారా రూ.30,047 కోట్లు స్టాంపులు- రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.9,354 కోట్లు అమ్మకం పన్ను ద్వారా రూ.19,591 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఎక్సైజ్ పన్నుల ద్వారా రూ.14,607 కోట్లు కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా రూ.8,177 కోట్లు సమకూరాయి. ఇతర పన్నుల రూపంలో మరో రూ.5,304 కోట్లు ఖజానాకు చేరాయి. పన్నేతర ఆదాయం బడ్జెట్‌లో రూ.22,808 కోట్లు అంచనా వేయగా నవంబర్ చివరి నాటికి రూ.19,524 కోట్లు ఖజానాకు వచ్చాయి.
నవంబర్ నెలలో రాష్ట్రానికి వచ్చిన పన్నుల వివరాలు :
పన్నుల రకం | రాబడి(కోట్లలో) |
జీఎస్టీ | 30,047 |
స్టాంపులు- రిజిస్ట్రేషన్లు | 9,354 |
అమ్మకం పన్ను | 19,591 |
ఎక్సైజ్ పన్ను | 14,607 |
రాష్ట్ర వాటా | 8,177 |
ఇతర పన్నులు | 5,304 |
మొత్తం | 87,083 |