Telangana Tax Income May :ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండునెలల్లో.. రాష్ట్ర ప్రభుత్వానికి పన్ను ఆదాయంఅంచనాల్లో 13 శాతానికి పైగా సమకూరింది. 2023-23 వార్షిక బడ్జెట్‌లో పన్నుల రూపేణా లక్షా 52 వేల 499 కోట్లు వస్తాయని అంచనా వేశారు. మే నెలాఖరు నాటికి 20 వేల 97 వేల కోట్లు ఖజానాకు వచ్చాయి. జీఎస్టీ ద్వారా 7 వేల 430 కోట్లు, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా 2 వేల 358, అమ్మకం పన్ను నుంచి 4 వేల 802 కోట్లు సమకూరాయి.
Tax Revenue in Telangana 2023 : ఎక్సైజ్ పన్నుల ద్వారా 2 వేల 683 కోట్లు రాగా.. కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటాగా వెయ్యి 494 కోట్లు, ఇతర పన్నుల రూపంలో మరో వెయ్యి 327 కోట్లు ఖజానాకు చేరాయి. అన్ని రకాల పన్నుల ద్వారా ఏప్రిల్‌లో 9 వేల 698 కోట్లు సమకూరగా మేలో కాస్త పెరిగి 10 వేల 399 కోట్లు ఖజానాకు చేరాయి. పన్నేతర ఆదాయంఏప్రిల్‌తో పోలిస్తే స్వల్పంగా పెరిగింది. రెండు నెలల్లో పన్నేతర ఆదాయం 891 కోట్లు వచ్చింది. గ్రాంట్ల రూపంలో ఏప్రిల్‌లో రాష్ట్రానికి ఒక్కరూపాయి రాకపోగా.. మేలో వెయ్యి 438 కోట్లు వచ్చాయి. అన్ని రకాలుగా తొలి రెండు నెలల్లో రెవెన్యూ రాబడి 22 వేల 427 కోట్లుగా ఉంది. బడ్జెట్ అంచనా వేసిన 2 లక్షల 16 వేల 566 కోట్లలో అది పది శాతానికిపైగా ఉంది.