రాష్ట్రంలో భారీగా పెరిగిన వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం
రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖ రాబడులు 2020 నవంబరులో భారీగా పెరిగాయి. ఏకంగా 77శాతం అధికంగా వసూలైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
రాష్ట్రంలో భారీగా పెరిగిన వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం
By
Published : Dec 16, 2020, 10:54 PM IST
తెలంగాణలో వాణిజ్య పన్నుల శాఖ రాబడులు 2020 నవంబరులో భారీగా పెరిగింది. 2019 నవంబరు నెలలో రూ.3,886 కోట్లు పన్నుల రాబడులు రాగా... 2020 నవంబరులో రూ.6876.51 కోట్లు ఆదాయం వచ్చి 77శాతం వృద్ది నమోదు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
విభాగం, వ్యాట్ రూపంలో
2019 నవంబరులో ఆదాయం
రూ. కోట్లలో
2020 నవంబరులో ఆదాయం
రూ. కోట్లలో
పెట్రోల్‌పై వ్యాట్
746
804.62
మద్యం అమ్మకాల ద్వారా
950
1100
ఎస్‌జిఎస్టీ
1173
1077.39
ఐజీఎస్టీ
945
1025.28
ఐజీఎస్టీ సెటిల్మెంట్
0
2638
జీఎస్టీ పరిహారం
0
164.41
ఇతర పన్నుల ద్వారా
72
66.81
మొత్తం రాబడులు
3886
6876.51
గతేడాది నవంబరులో ఐజీఎస్టీ సెటిల్మెంటు ద్వారా ఒక రూపాయి కూడా రాకపోగా... గత నెలలో ఏకంగా రూ.2,638 కోట్లు వచ్చింది. మరో రూ.164.41 కోట్లు పరిహారం కింద రాష్ట్రానికి రావడం వల్ల వస్తు సేవల పన్ను ఆదాయం భారీగా వచ్చినట్లయ్యిందని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తెలిపారు.