రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ప్రభుత్వం గురువారం హైకోర్టుకు నివేదిక సమర్పించింది. 63 ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్సలు అందుతున్నాయని నివేదించింది. గతంలో 42 ఆస్పత్రులు ఉండగా... తాజాగా 21 దవాఖానాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు నివేదిక - తెలంగాణలో కొవిడ్ పరిస్థితి
రాష్ట్రంలో 63 ఆస్పత్రుల్లో కరోనా చికిత్సలు జరుగుతున్నాయని హైకోర్టుకు ప్రభుత్వం నివేదించింది. గతంలో 42 ఆస్పత్రులు ఉండగా.. జిల్లాల్లో మరో 21 ఏర్పాటు చేసినట్లు పేర్కొంది.
కరోనా పరీక్షలు, చికిత్సలు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులు, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఫీజులు తదితర అంశాలపై దాఖలైన 24 ప్రజా ప్రయోజనాలను కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి ధర్మాసనం ఇవాళ విచారణ చేపట్టింది. అయితే సరిగ్గా విచారణ ప్రారంభమయ్యే ముందు నివేదిక ఇస్తే ఎలా పరిశీలిస్తామని హైకోర్టు పేర్కొంది. ఈనెల 12న విచారణ చేపడతామని.. తాజా నివేదికలు సమర్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది.
ఇదీ చూడండి: 12,13 తేదీల్లో అసెంబ్లీ సమావేశాలు.. చట్ట సవరణలు చేసే అవకాశం!