తెలంగాణ

telangana

ETV Bharat / state

'పుర పోరు కొత్త షెడ్యూల్​ జారీ' - 2019

మున్సిపల్​ ఎన్నికలకు సంబంధించిన కొత్త షెడ్యూల్​ జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. పురపోరు ఆగస్టు మాసంలో పూర్తి చేసేందుకు ఇటు ఎన్నికల సంఘం...అటు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి.

మున్సిపల్​ ఎన్నికలు

By

Published : Jul 15, 2019, 4:24 PM IST

పురపోరు సంబంధించిన కొత్త షెడ్యూల్​ను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ​ జారీ చేసింది. గత షెడ్యూల్​ ప్రకారం ఆదివారమే ఓటరు తుది జాబితా ప్రకటించాల్సి ఉన్నప్పటికీ వివిధ కారణాల వల్ల అది వాయిదా పడింది. మున్సిపల్​ ఎన్నికలను ఆగస్టు మాసంలో పూర్తి చేసేందుకు ఇటు ఎన్నికల సంఘం...అటు రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా ఏర్పాట్లు చేస్తున్నాయి. నూతన షెడ్యూల్​ ప్రకారం ఈనెల16న ముసాయిదా ప్రకటించి అభ్యంతరాలు స్వీకరణ చేపడుతారు. ఎన్నికలు జరగనున్న మూడు కార్పొరేషన్లు, 129 మున్సిపాలిటీల్లో ఈనెల 21న పోలింగ్ కేంద్రాల జాబితా ప్రకటిస్తారు.

పరిశీలకులతో సమావేశం...

ఎన్నికల పరిశీలకులతో రాష్ట్ర ఎన్నికల సంఘం సమావేశమైంది. పురపోరుకు సంబంధించిన పలు అంశాలపై పరిశీలకులతో చర్చించారు. ఈసమావేశంలో ఎస్​ఈసీ నాగిరెడ్డి, పురపాలక శాఖ సంచాలకులు శ్రీదేవి పాల్గొన్నారు.

ఈనెల 17న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం...

పురపోరును ఆగస్టు మాసంలో పూర్తి చేయాలనే దిశగా తెరాస ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఈనెల 17న సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. నూతన పురపాలక చట్ట బిల్లుకు ఆమోదం తెలపనుంది. ఈనెల 18, 19 తేదీల్లో శాసనసభ ప్రత్యేక సమావేశాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది.

ఇవీ చూడండి:భాజపా నేత మురళీధర్​రావుపై హైకోర్టులో పిటిషన్​

ABOUT THE AUTHOR

...view details