తెలంగాణ

telangana

ETV Bharat / state

పోలీస్ అభ్యర్థులకు అలర్ట్... ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షల తేదీలివే.. - ఎస్సై కానిస్టేబుల్‌ పరీక్షల తేదీలివే

TS Police Prelims Exam Dates 2022:రాష్ట్రంలో ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలు విడుదల అయ్యాయి. రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు ప్రకటించింది. ఆగస్టు 7న ఎస్‌ఐ, 21న కానిస్టేబుల్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది.

TS Police Prelims Exam Dates 2022
ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల తేదీలివే

By

Published : Jul 4, 2022, 3:48 PM IST

TS Police Prelims Exam Dates 2022: తెలంగాణలో ఎస్సై, కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు ప్రిలిమినరీ రాత పరీక్షల తేదీలను రిక్రూట్‌మెంట్‌ బోర్డు విడుదల చేసింది. ఆగస్టు 7న ఎస్సై, ఆగస్టు 21న కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఎస్సై రాత పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఈ నెల 30 నుంచి, కానిస్టేబుల్‌ అభ్యర్థులు ఆగస్టు 10 నుంచి బోర్డు వైబ్‌సైట్‌ www.tslprb.inలో హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని సూచించింది.

మొత్తం 554 ఎస్సై, 15,644 కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 25న నోటిఫికేషన్‌ విడుదలైన సంగతి తెలిసిందే. మరో 614 ప్రొహిబిషన్‌, ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులకు ఏప్రిల్‌ 28న నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ మేరకు 2.54 లక్షల మంది అభ్యర్థులు ఎస్సై ప్రిలిమినరీ పరీక్షకు హాజరుకానున్నట్లు అధికారులు భావిస్తున్నారు. కానిస్టేబుల్‌ పోస్టులకు 6.50 లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నట్లు తెలిపారు. ఎస్సై పోస్టులకు హైదరాబాద్‌ సహా రాష్ట్రంలోని 20 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, కానిస్టేబుల్‌ పరీక్షలకు హైదరాబాద్‌ సహా 40 పట్టణాల్లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు సంబంధిత అధికారులు పేర్కొన్నారు.

ఎస్సై, కానిస్టేబుల్‌ ప్రిలిమినరీ పరీక్షల తేదీలివే

వివరాలు ఇలా...

ప్రిలిమినరీ పరీక్ష పరీక్ష తేదీ సమయం హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ తేదీ
ఎస్‌ఐ ఆగస్టు 7 10AM - 1PM జులై 30 నుంచి
కానిస్టేబుల్‌ ఆగస్టు 21 10AM - 1PM ఆగస్టు 10 నుంచి
ఎస్‌ఐ పోస్టులు 554
కానిస్టేబుల్ పోస్టులు 15,644
ఎక్సైజ్ కానిస్టేబుల్ పోస్టులు 614
  • ఎస్‌ఐ రాత పరీక్షకు 2.45 లక్షల మంది దరఖాస్తు
  • కానిస్టేబుల్ రాత పరీక్షకు 6.50లక్షల మంది దరఖాస్తు
  • హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాల్సిన వెబ్‌సైట్‌ www.tslprb.in

ఇదీ చూడండి: ఇలా చేస్తే.. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ ప్రిలిమ్స్‌ ఈజీగా గట్టెక్కొచ్చు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details