తెలంగాణ విత్తనాలు ఐరోపా దేశాలకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమమైందని వచ్చే సంవత్సరం నుంచి ఎగుమతులు మరింత పెరుగుతాయని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తెలిపారు. విదేశాలకు విత్తనాలు ఎగుమతి చేయాలంటే ఆయా దేశాల ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రపంచంలో అంతర్జాతీయ విత్తన ధ్రువీకరణ పద్ధతి (ఓఈసీడీ) భాగస్వామ్య దేశాల సమూహం, ఐరోపా దేశాల సమూహం. ప్రమాణిక విత్తనోత్పత్తి, పరీక్ష పద్ధతులను అనుసరిస్తూ రైతులకు విత్తనాలు సరఫరా చేస్తున్నాయని తెలిపారు.
తెలంగాణ విత్తనాలు...ఐరోపా దేశాలకు ఎగుమతి - తెలంగాణ విత్తనాలు
తెలంగాణ విత్తనాలు వచ్చే సంవత్సరం నుంచి ఐరోపా దేశాలకు ఎగుమతి చేయనున్నామని వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పార్థసారథి తెలిపారు. ప్రమాణిక విత్తనోత్పత్తి, పరీక్ష పద్ధతులను అనుసరిస్తూ రైతులకు విత్తనాలు సరఫరా చేయనున్నామని తెలిపారు.
తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ
2009లో ఓఈసీడీలో భాగస్వామ్య దేశంగా చేరిన భారత్ మేలైన ధ్రువీకరణ పద్ధతులతో భాగస్వామ్య దేశాలకు, ముఖ్యంగా తెలంగాణ నుంచి విత్తనాలు ఎగుమతి చేస్తోందని పార్థసారథి వివరించారు. ఇందులో భాగంగా గతేడాది ‘ఈయూ సీడ్ ఇక్వలెన్సీ’ సాధించేందుకు కేంద్రం తెలంగాణ విత్తన ధ్రువీకరణ సంస్థ డైరెక్టర్ కేశవులను నోడల్ అధికారిగా నియమించిందన్నారు. గతేడాది సెప్టెంబరులో భారత విత్తన చట్టం, విత్తనోత్పత్తి- విత్తన పరీక్ష పద్ధతులు, ప్రమాణాలు, పంట రకాల నమోదు, విడుదల పద్ధతులపై డాక్యుమెంట్‌ను రూపొందించి కేశవులు యూరోపియన్ కమిషన్‌కు దరఖాస్తు పంపించారని చెప్పారు. దానిపై చట్టపరమైన ప్రాథమిక విశ్లేషణ పూర్తి చేశామని, అక్టోబరులో భారత్‌కు వచ్చి విత్తన ప్రమాణాలపై క్షేత్రస్థాయి విశ్లేషణ చేపడుతామని యూరోపియన్ కమిషన్ ఆరోగ్య-ఆహార భద్రత విభాగం డైరెక్టర్ జనరల్ నాండోర్ పెటె తెలిపారని వెల్లడించారు.
ఇదీ చూడండి :నేడే తరలింపు...రంగం సిద్ధం