Telangana Students Getting 2 Days Holidays : తెలంగాణలో విద్యార్థులకు వరుసగా సెలవులు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వర్షాలు మొదలు వివిధ కారణాలతో విద్యాసంస్థలు మూతపడ్డాయి. తాజాగా మరోసారి సెలవుల అంశం తెరమీదకు వచ్చింది. మరి, ఈ సారి ఎప్పుడు వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (Telangana Public Service Commission) ఆధ్వర్యంలో ఆగస్టులో నిర్వహించాల్సిన గ్రూప్ 2 పరీక్షలు.. వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆగస్టు 29, 30 తేదీల్లో నిర్వహించాల్సిన పరీక్షలు.. అభ్యర్థుల ఆందోళన కారణంగా అర్థంతరంగా వాయిదా వేశారు. ఈ పరీక్షలను తిరిగినవంబరు 2, 3 తేదీల్లో నిర్వహించేందుకు అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో.. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ ఉన్నతాధికారులు చర్యలు చేపడుతున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్లతో చర్చలు చేపడుతున్నారు.
TSPSC Group 2 Exam Reschedule Dates : గ్రూప్- 2 పరీక్ష రీషెడ్యూల్.. కొత్త తేదీలివే
పరీక్షలు రాయబోతున్న అభ్యర్థులు 5 లక్షల మంది..
5 Lakh Candidates Going to Write Group 2 Exams : టీఎస్పీఎస్సీ మొత్తం 783 గ్రూప్-2 పోస్టులకు పరీక్షలు నిర్వహించనుంది. ఈ పరీక్షలకు 5లక్షల 51 వేల 943 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల ఎంపిక పరీక్షను ఓఎంఆర్ పద్ధతిలో తెలంగాణ పబ్లిక్ సర్విస్ కమిషన్ నిర్వహించనుంది. గతంలో పేపర్ లీకేజీ వ్యవహారం కారణంగా ఎంతటి దుమారం చెలరేగిందో తెలిసిందే. ఈ నేపథ్యంలో.. ఈసారి మరింత కట్టుదిట్టమైన భద్రతా చర్యల నడుమ పరీక్షలు నిర్వహించాలని టీఎస్పీఎస్సీ భావిస్తోంది. తద్వారా.. ఎలాంటి వివాదాలకు ఆస్కారం ఇవ్వకూడదని బలమైన కసరత్తు చేస్తోంది.