TRS Ministers Meeting paddy procurement: కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ అధికారులతో మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్ దిల్లీలో మంగళవారం భేటీ అయ్యారు. ధాన్యం సేకరణ వ్యవహారంపై కేంద్ర అధికారులతో చర్చిస్తున్నారు.
TRS Ministers Meeting: కేంద్ర వినియోగదారులశాఖ అధికారులతో మంత్రుల భేటీ - తెలంగాణ వార్తలు
కేంద్ర వినియోగదారులశాఖ అధికారులతో తెరాస మంత్రులు(TRS Ministers Meeting) సమావేశమయ్యారు. ధాన్యం సేకరణ వ్యవహారంపై కేంద్ర అధికారులతో చర్చిస్తున్నారు. మంత్రులు కేటీఆర్, నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్‌తో పాటు పలువురు ఎంపీలు ఈ భేటీలో పాల్గొన్నారు.
కేంద్ర వినియోగదారులశాఖ అధికారులతో మంత్రుల భేటీ
ఈ సమావేశంలో ఎంపీలు కేశవరావు, నామా నాగేశ్వరరావు, రంజిత్ రెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, మాలోత్ కవిత, లింగయ్య యాదవ్, పసునూరి దయాకర్ కూడా పాల్గొన్నారు. వీరితో పాటు బీబీ పాటిల్, మన్నే శ్రీనివాసరెడ్డి, సురేష్ రెడ్డి హాజరయ్యారు.
ఇదీ చదవండి:MLC elections in telangana: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల గడువు