తెలంగాణ

telangana

ETV Bharat / state

'రాష్ట్రానికి ఏమీ చేయని ప్రధాని.. విమర్శలు మాత్రం చేశారు'

Ministers on PM Modi: ప్రధాని మోదీ రాష్ట్రానికి టూరిస్టులా వచ్చి వెళ్లారని... రాష్ట్రానికి ఏం చేశారో మాత్రం చెప్పలేక పోయారని తెరాస నేతలు విమర్శించారు. కుల పార్టీ అంటూ తెరాసపై చేసిన విమర్శలను తిప్పికొట్టారు. రాజకీయాల్లో కులమతాల ప్రస్తావన భాజపా నుంచే ప్రారంభమైందని మండిపడ్డారు. కుటుంబపార్టీలపై మాట్లాడే నైతికత భాజపాకు లేదని.... ఆ పార్టీలో ఒకే కుటుంబానికి చెందినవాళ్లు చాలా మంది ఉన్నారని అన్నారు.

'రాష్ట్రానికి ఏమీ చేయని ప్రధాని.. విమర్శలు మాత్రం చేశారు'
'రాష్ట్రానికి ఏమీ చేయని ప్రధాని.. విమర్శలు మాత్రం చేశారు'

By

Published : May 27, 2022, 8:00 PM IST

'రాష్ట్రానికి ఏమీ చేయని ప్రధాని.. విమర్శలు మాత్రం చేశారు'

Ministers on PM Modi: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రధాని మోదీ చేసిన విమర్శలను తెరాస నాయకులు తిప్పికొట్టారు. రాష్ట్రానికి ఏమీ చేయని వారు... ఇప్పుడు వచ్చి విమర్శలు మాత్రం చేస్తున్నారని ఆక్షేపించారు. అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్న తెలంగాణను విమర్శించడం మానుకోవాలన్నారు. దేశానికి ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. రాష్ట్రానికి ఏం చేశారో చెప్పగలిగారా అని మోదీని తలసాని ప్రశ్నించారు.

"దమ్ముంటే కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని రద్దు చేయండి.. ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్​కు చెప్పి ప్రభుత్వాన్ని రద్దు చేస్తాం. ఎన్నికల్లో చూసుకుందాం. ప్రధాని మోదీకి ధైర్యం ఉందా?. కేంద్ర మంత్రుల బెదిరింపులకు ఇక్కడా ఎవరూ భయపడరు. 7 ఏళ్లలో దేశానికి ఏం చేశారో చెప్పండి?. ప్రజలు ఎన్నుకున్న నాయకులం మేం కాదా?. కేటీఆర్‌ను అందరూ మెచ్చుకుంటుంటే చూడలేకపోతున్నారు.ధాన్యం విషయంలో మీ నాటకాలు ఎవరికీ తెలియవనుకుంటున్నారా?." -తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, పశుసంవర్ధకశాఖ మంత్రి

ఆ నైతికత వారికి లేదు: కుటుంబ పార్టీలపై మాట్లాడే నైతికత భాజపాకు, మోదీకి లేదని మంత్రి గంగుల కమలాకర్ విమర్శించారు. ఆ పార్టీలో ఒకే కుటుంబానికి చెందినవాళ్లు చాలా మంది ఉన్నారని గుర్తుచేశారు. కేసీఆర్​ కుటుంబసభ్యులు ప్రజల చేత నేరుగా ఎన్నికయ్యారని... రాష్ట్ర ఉద్యమంలో కేసీఆర్​ కుటుంబం త్యాగాలు చేసిందన్నారు.

"తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కేసీఆర్​ కుటుంబం ఉంది. కేసీఆర్​ కుటుంబ సభ్యులందరూ ఉద్యమం చేసే ప్రజలతో ఎన్నుకోబడ్డారు. కుటుంబ పాలన అనే అర్హత మీకు లేదు. కేవలం తిట్టడానికే వస్తున్నారో.. లేక హైదరాబాద్​ అభివృద్ధిని చూసి వెళ్లడానికి వస్తున్నారో తెలియదు.. కానీ మొత్తానికైతే టూరిస్టులా చూసి వెళ్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలకు తెలుసు టూరిస్టులు ఎవరో. రాబోయే రోజుల్లో తెలంగాణ ప్రజలు కేసీఆర్​ను ఒక ఆస్తిగా భావిస్తారు." -గంగుల కమలాకర్​, బీసీ సంక్షేమశాఖ మంత్రి

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details