తెలంగాణ

telangana

ETV Bharat / state

Telangana Merger Day Celebrations in CPI Office : 'కొన్ని పార్టీలు.. తమ రాజకీయ పబ్బం కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయి' - Koonanneni Sambasivarao

Telangana Merger Day Celebrations in CPI Office : సెప్టెంబర్​ 17ను పురస్కరించుకుని హైదరాబాద్ హిమాయత్​నగర్​లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం​లో తెలంగాణ విలీన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్​ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయగా.. సీపీఐ పార్టీ జెండాను రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆవిష్కరించారు. రైతాంగ సాయుధ పోరాటం ఫలితంగానే.. నిజాం నిరంకుశ పాలన ముగిసిందని పేర్కొన్నారు.

CPI Latest News
Telangana Merger Day Celebrations in CPI Office

By ETV Bharat Telangana Team

Published : Sep 17, 2023, 2:03 PM IST

Updated : Sep 17, 2023, 3:14 PM IST

Telangana Merger Day Celebrations in CPI Office ఆనాటి రైతులు, కమ్యూనిస్టుల సాయుధపోరాట ఫలితమే.. స్వాతంత్య్ర తెలంగాణ

Telangana Merger Day Celebrations in CPI Office Hyderabad :అప్పటి భూస్వాములు, రజాకార్లకు వ్యతిరేకంగా.. రైతులు, కమ్యూనిస్టుల సాయుధ పోరాటం ఫలితంగానే.. స్వాతంత్య్ర తెలంగాణ ఆవిర్భవించిందని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. సెప్టెంబర్ 17(September 17)ను పురస్కరించుకని తెలంగాణ విలీన వేడుకలను.. సీపీఐ కార్యాలయం​లో జాతీయ జెండా ఎగురవేసి ఘనంగా నిర్వహించారు.

KCR At Telangana National Integration Day 2023 : ''తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుచరిస్తోంది' అనేది అక్షర సత్యం'

September 17 Celebrations in telangana : నేడు కొన్ని రాజకీయపార్టీలు తమ రాజకీయ పబ్బం కోసం చరిత్రను వక్రీకరిస్తున్నాయని.. వివిధ పేర్లతో తెలంగాణ విలీన దినోత్సవాలను నిర్వహిస్తున్నాయని సీపీఐ(CPI) జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్​రెడ్డి(Chada Venkat Reddy)) మండిపడ్డారు. ఉమ్మడి పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని.. అప్పటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి రోశయ్యను డిమాండ్ చేసిన కేసీఆర్.. నేడు తన ప్రభుత్వ హయాంలో ఎందుకు అధికార లాంఛనాలతో నిర్వహించడం లేదని ప్రశ్నించారు.

CPI Latest News :స్వరాష్ట్రం సాధించాక తాము అధికారంలోకి వచ్చిన అనంతరం.. ప్రత్యేక రాష్ట్రంలో తెలంగాణ విలీన దినోత్సవాలను అధికారికంగా నిర్వహిస్తామని పేర్కొన్న కేసీఆర్.. నేడు ఎవరికి భయపడి అధికారికంగా నిర్వహించడం లేదో తెలంగాణ సమాజానికి తెలుసన్నారు. తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మించిన కేసీఆర్.. రైతాంగ సాయుధ పోరాట అమరుల స్థూపాన్ని ఎందుకు నిర్మించలేదని చాడ ప్రశ్నించారు.

"నేడు కొన్ని రాజకీయపార్టీలు తమ రాజకీయ పబ్బం కోసం.. వివిధ పేర్లతో తెలంగాణ విలీన దినోత్సవాలను నిర్వహిస్తున్నాయి. ఉమ్మడి పాలనలో ఉన్నప్పుడు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన కేసీఆర్.. నేడు ఎందుకు నిర్వహించడం లేదు. ప్రత్యేక రాష్ట్రం వచ్చాక.. ఎవరకి భయపడి నిర్వహించడం లేదో తెలంగాణ సమాజానికి తెలుసు". - చాడ వెంకట్ రెడ్డి, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు

Telangana Liberation Day Celebrations 2023 : పరేడ్​ గ్రౌండ్స్​లో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత.. సైనిక చర్య ద్వారా తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని(Koonanneni Sambasivarao) పేర్కొన్నారు. పేదవారిని, అణగారిన వర్గాల ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న ఆనాటి రజాకార్లను, దేశ్​ముఖ్​లు, జమీందార్లు, జాగీర్​దార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారన్నారు. రైతాంగ పోరాటం, అమర వీరుల పోరాట స్పూర్తితో ముందుకు వెళ్తామన్నారు.

"దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత.. సైనిక చర్య ద్వారా తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. పేదవారిని, అణగారిన వర్గాల ప్రజలను పీల్చి పిప్పి చేస్తున్న.. ఆనాటి రజాకార్లను, దేశ్​ముఖ్​లు, జమీందార్లు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా సాగిన సాయుధ పోరాటంలో ఎంతో మంది అసువులు బాశారు. రైతాంగ పోరాటం, అమర వీరుల పోరాట స్పూర్తితో ముందుకు వెళ్తాం". - కూనంనేని సాంబశివరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

Amit Shah Speech at Telangana Liberation Day 2023 : 'పటేల్‌ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు'

Last Updated : Sep 17, 2023, 3:14 PM IST

ABOUT THE AUTHOR

...view details