తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎంబీబీఎస్ సీట్లకు తుది విడత కౌన్సెలింగ్

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో మిగిలిన ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఆఖరి విడత కౌన్సెలింగ్​కు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎంబీబీఎస్ సీట్లకు తుది విడత కౌన్సెలింగ్

By

Published : Aug 26, 2019, 4:52 AM IST

Updated : Aug 26, 2019, 7:52 AM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాలో 105 ఎంబీబీఎస్ సీట్లు మిగిలాయి. ఆ సీట్ల ఆఖరి విడత కౌన్సెలింగ్​కు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం చర్యలు చేపట్టింది. ఇప్పటికే మూడు విడతల ప్రవేశ ప్రక్రియ పూర్తవగా.. మిగిలిన సీట్లకు ఆదివారం సాయంత్రం నుంచే వెబ్​ఆప్షన్లకు విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన సంక్షిప్త సందేశాలను అర్హులైన విద్యార్థుల ఫోన్లకు పంపించింది. కళాశాలల వారీగా ఖాళీలను వెబ్​సైట్​లో అధికారులు పొందుపర్చారు.

మొదటి ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు అర్హులైన అభ్యర్థులందరూ సిద్ధంగా ఉండలన్నారు. ఈ నెల 26న సాయంత్రం 5 గంటల్లోపు వెబ్​ఆప్షన్లు నమోదు చేసుకోవాలని కాళోజీ ఆరోగ్య వర్సిటీ ఉపకులపతి కరుణాకర్​ రెడ్డి తెలిపారు. అభ్యర్థులకు ఈ నెల 29వరకు గడువు ఇవ్వనున్నట్లు వర్సిటీ వర్గాలు తెలిపాయి. యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో ప్రవేశాలకూ ఈ నెల 27తో గడువు ముగియనుంది. ఆయా కోటాల్లో ఆఖరి విడతను 28న నిర్వహించాలని వర్సిటీ యోచిస్తోంది. అప్పటికీ యాజమాన్య, ప్రవాస భారతీయ కోటాల్లో సీట్లు మిగిలితే వాటిని ఆయా కళాశాలలకే భర్తీ చేసుకోవడానికి అవకాశమిస్తామన్నారు. అన్ని కోటాల్లోనూ ఎంబీబీఎస్ సీట్ల ప్రవేశాలను ఈ నెల 31వ తేదీతో పూర్తి చేయాలనే ఎంసీఐ సూచనతో... కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది.

ఎంబీబీఎస్ సీట్లకు తుది విడత కౌన్సెలింగ్

ఇదీ చూడండి : అభిరుచులకు అనుగుణంగా రెస్టారెంట్

Last Updated : Aug 26, 2019, 7:52 AM IST

ABOUT THE AUTHOR

...view details