రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల వారీగా కుటుంబ న్యాయస్థానాలు ఏర్పాటు చేసే అంశంపై ప్రభుత్వం ఆలోచిస్తోందని న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పలువురు మంత్రులు సమాధానం ఇచ్చారు.
'కుటుంబ న్యాయస్థానాల ఏర్పాటు దిశగా ప్రభుత్వం ఆలోచిస్తోంది' - తెలంగాణ శాసనమండలి సమావేశాలు
రాష్ట్రంలోని వ్యవసాయ కూలీలకు రైతుబీమా పథకాన్ని వర్తింపజేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీలు జీవన్‌రెడ్డి, కడియం శ్రీహరి ప్రభుత్వాన్ని కోరారు. శాసన మండలిలో జరిగిన చర్చ సందర్బంగా మాట్లాడిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి ఉమ్మడి జిల్లాలో కుటుంబ న్యాయస్థానాలను ఏర్పాటు చేసే విషయమై ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలిపారు.
తెలంగాణ శాసనమండలి సమావేశాలు
వ్యవసాయ కూలీలకు రైతు బీమా పథకాన్ని వర్తింపు చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కడియం శ్రీహరిలు కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 45,516 కుటుంబాలకు రైతు బీమా అందించినట్లు వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడిన విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనున్నట్లు తెలిపారు.