ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలురూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్ శాసనసభలో 2022-23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు ప్రవేశపెట్టారు. రూ.2.56 లక్షల కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ప్రజల అభివృద్ధే లక్ష్యంగా.. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ఈ పద్దును ప్రతిపాదించినట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.కేసీఆర్ మార్క్ బడ్జెట్: హరీశ్రావుఇది బడుగుల జీవితాలు మార్చే బడ్జెట్ అని మంత్రి హరీశ్‌రావు అసెంబ్లీ సమావేశాల్లో పేర్కొన్నారు. ఇది ముమ్మాటికీ కేసీఆర్ మార్క్ బడ్జెట్ అని కితాబిచ్చారు. 2015-16 నుంచి రాష్ట్ర జీఎస్‌డీపీ జాతీయ సగటు కంటే ఎక్కువ అని స్పష్టం చేశారు.భాజపా సభ్యుల సస్పెన్షన్ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజునే అనూహ్య సంఘటన చోటుచేసుకొంది. శాసన సభలో మంత్రి హరీశ్‌రావు బడ్జెట్ ప్రవేశపెడుతుండగా.. భాజపా సభ్యులు ఈటల రాజేందర్, రఘునందర్రావు, రాజాసింగ్.. అడ్డుతగులుతున్నారంటూ వారిని సభ నుంచి సస్పెండ్ చేసింది.ఇంటి నిర్మాణానికి రూ.3లక్షల సాయంసొంత స్థలం ఉండి... ఇల్లు కట్టుకునే వారికి ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థిక సాయం చేయనుంది. ఈ మేరకు బడ్జెట్లో మంత్రి హరీశ్ రావు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. సొంత స్థలంలో 2 పడకల ఇళ్ల నిర్మాణానికి రూ.3లక్షల ఆర్థికసాయం చేయనున్నట్లు ప్రకటించారు. గత ఎన్నికల్లోనే తెరాస ప్రభుత్వం... ఈ విషయంపై హామీ ఇచ్చింది.హారిస్ వెళ్లిన ఎయిర్‌బేస్ వద్ద కలకలం! అమెరికాలోని వైమానిక స్థావరం జాయింట్ బేస్ ఆండ్రూస్‌లో ఓ సాయుధుడు కలకలం సృష్టించాడు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ ప్రయాణిస్తున్న విమానం అక్కడి నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ఘటన జరగటం గమనార్హం.సరిహద్దులో పాక్ డ్రోన్ కూల్చివేతపంజాబ్ ఫిరోజ్‌పుర్ సెక్టార్‌లోని అంతర్జాతీయ సరిహద్దులో సోమవారం ఓ పాకిస్థాన్ డ్రోన్‌ను కూల్చివేసింది సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్). అందులో 4కేజీల నిషేధిత వస్తువులు ఉన్నట్లు ఓ అధికారి వెల్లడించారు.చమురు ధరలకు రెక్కలు ఉక్రెయిన్ సంక్షోభం ముదిరిన నేపథ్యంలో దేశీయంగా స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్ర నష్టాలను చవిచూస్తున్నాయి. సెన్సెక్స్ (Sensex) 1413 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతోంది. ఇక అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. సోమవారం బ్యారెల్ చమురు ధర 10డాలర్లకు పైగా పెరిగింది.ఎన్ఎస్ఈలో మరోసారి సాంకేతిక సమస్యజాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (నిఫ్టీ)లో మరోసారి సాంకేతిక సమస్య ఎదురైంది. సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే కొన్ని స్టాక్ ధరలు తెరపై అప్‌డేట్ కాలేదని పలు బ్రోకరేజీ సంస్థలు ఎక్స్ఛేంజీ దృష్టికి తీసుకెళ్లాయి. దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపించాల్సి ఉందని పలువురు బ్రోకర్లు డిమాండ్ చేస్తున్నారు.నా పరువు, విశ్వసనీయత దెబ్బతీశాడు భారత క్రికెటర్ వృద్ధిమన్ సాహాను ఓ జర్నలిస్టు బెదిరించిన ఘటన ఇటీవల కాలంలో వివాదాస్పదమైంది. గత కొన్నిరోజుల నుంచి ఇదే విషయమై తెగ చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఆ జర్నలిస్టు ఎవరో తెలిసిపోయింది. స్వయంగా ఆ జర్నలిస్టే ప్రజల ముందుకు వచ్చి సాహాపై ఆరోపణలు చేశారు. ఇంతకీ ఆయన ఎవరంటే?ఈ వారం రిలీజయ్యే సినిమాలివే!కరోనా కారణంగా వాయిదా పడిన పెద్ద చిత్రాలు ఒక్కొక్కటిగా బాక్సాఫీస్ వద్దకు క్యూ కడుతున్నాయి. ఈ క్రమంలో మార్చి రెండో వారంలో రెండు పెద్ద చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమయ్యాయి. ఆ సినిమాలేంటో చూసేయండి.