తెలంగాణ

telangana

ETV Bharat / state

ఇంటర్​ పేపర్ల మూల్యాంకనానికి ఏర్పాట్లు

ముందుగా రెండో సంవత్సరం జవాబు పత్రాలు మూల్యాంకనం చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. ఇంటర్ బోర్డు అధికారులతో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.

inter board
ఇంటర్​ పేపర్ల మూల్యాంకనానికి ఏర్పాట్లు

By

Published : Apr 22, 2020, 5:04 AM IST

ఇంటర్​ ద్వితీయ సంవత్సరం జవాబు పత్రాల మూల్యాంకనం ముందుగా చేయాలని నిర్ణయించారు. మూల్యాంకన కేంద్రాలను 12 నుంచి 36 కు పెంచాలని విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ సూచించారు. మూల్యాంకనం చేసే ఎగ్జామినర్ల మధ్య భౌతిక దూరం ఉండేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. ఇతర జిల్లాల నుంచి హైదరాబాద్ వచ్చే అధ్యాపకుల కోసం వసతి ఏర్పాట్లు చేయాలని ఇంటర్ బోర్డు అధికారులకు తెలిపారు. ఎంసెట్, జేఈఈ, నీట్​కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం అందుబాటులోకి తెచ్చిన ఆన్​లైన్ కోచింగ్, పరీక్షలపై విస్తృత ప్రచారం కల్పించాలని జిల్లా ఇంటర్ విద్యాధికారులకు వివరించారు.

ఆన్​లైన్ పరీక్షలకు మంచి స్పందన వస్తోందని.. ఏపీ, ఒడిశా, బిహార్, యూపీ తదితర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఆసక్తి చూపిస్తున్నారని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. ఎంపీసీ విద్యార్థులు 5,346, బైపీసీ విద్యార్థులు 2,354 మంది ఆన్​లైన్ పరీక్షలకు హాజరయ్యారని వివరించారు. ఆన్​లైన్ కోచింగ్, పరీక్షలను అందుబాటులోకి తెచ్చిన ఇంటర్ బోర్డును అభినందించిన విద్యా శాఖ ప్రత్యేక కార్యదర్శి.. ఆసక్తి చూపే ఇతర రాష్ట్రాల విద్యార్థులకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. వివిధ జిల్లాల ఇంటర్ విద్యాధికారులు వీడియో సమీక్షకు హాజరయ్యారు.

ఇవీ చూడండి:రాష్ట్రంలో 872కు చేరిన కరోనా పాజిటివ్​ కేసులు

ABOUT THE AUTHOR

...view details