తెలంగాణ

telangana

ETV Bharat / state

HighCourt: దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు - దిశ హత్యాచార నిందితుల ఎన్​కౌంటర్ కేసు

HighCourt
HighCourt: దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

By

Published : Oct 28, 2021, 11:26 AM IST

Updated : Oct 28, 2021, 11:49 AM IST

11:22 October 28

దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు

దిశ కమిషన్ విచారణ ప్రక్రియలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు పేర్కొంది. దిశ కమిషన్ విచారణ తీరుపై డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి దాఖలు చేసిన పిటిషన్లను ధర్మాసనం  కొట్టివేసింది.  సిర్పూర్కర్‌ కమిషన్ విచారణ చట్టవిరుద్ధంగా జరుగుతోందని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. తమను చివరగా విచారణ జరిపేలా ఆదేశించాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల అభ్యర్థనను హైకోర్టు నిరాకరించింది. విచారణ తీరును నిర్ణయించుకునే అధికారం కమిషన్‌కు ఉంటుందని స్పష్టం చేసింది.

సంచలనం సృష్టించిన ఘటన  

   2019, నవంబర్​ 27న జరిగిన దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. షాద్​నగర్​ ఓఆర్‌ఆర్‌ టోల్‌గేట్‌కు 50మీటర్ల దూరంలో అత్యాచారం చేసిన నిందితులు అనంతరం హత్య చేశారు. మృతదేహాన్ని వారి లారీలో షాద్‌నగర్‌ మండలం చటాన్‌పల్లి జాతీయ రహదారిపై ఉన్న వంతెన కిందకు తీసుకెళ్లి డీజిల్‌ పోసి నిప్పంటించారు. నిందితులను 2019, డిసెంబర్​ 6న తెల్లవారుజామున పోలీసుల ఎన్​కౌంటర్​ చేశారు. సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేస్తుండగా పోలీసులు వద్ద ఆయుధాలు తీసుకుని పారిపోయేందుకు యత్నించిన నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు.  ఆత్మరక్షణ కోసం కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. ఎన్‌కౌంటర్‌లో మహ్మద్ ఆరిఫ్ పాషా, జొల్లు శివ, నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. దిశ హత్యాచార ఘటన, నిందితుల ఎన్​కౌంటర్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీంతో పలువురు మానవ హక్కుల సంఘాలు సుప్రీంకోర్టు, హైకోర్టును ఆశ్రయించాయి. ఎన్​కౌంటర్ ఘటనపై సుప్రీంకోర్టు  2019 డిసెంబర్ 12న ముగ్గురు సభ్యులతో న్యాయ కమిషన్ ఏర్పాటు చేసి ఆర్నెళ్ల గడువు విధించింది.

త్రిసభ్య కమిషన్​ విచారణ  

   ఫిబ్రవరి 3న త్రిసభ్య కమిషన్​ విచారణ ప్రారంభించింది. సిర్పూర్కర్ కమిషన్ ఆర్నెళ్లలో సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాల్సి ఉన్నప్పటికీ... కరోనా కారణంగా విచారణ వాయిదా పడుతూ వచ్చింది. ఆర్నెళ్లలో విచారణ పూర్తి చేయాలని సుప్రీంకోర్టు... సిర్పూర్కర్ కమిషన్​ను ఆదేశించడంతో ఆ మేరకు విచారణ కొనసాగుతోంది. దిశ కుటుంబ సభ్యులు, ఎన్​కౌంటర్​లో చనిపోయిన కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించింది. ఎన్​కౌంటర్​లో పాల్గొన్న పోలీసులతో పాటు... పంచనామా నిర్వహించిన రెవెన్యూ అధికారులను, వైద్యులను ప్రశ్నించింది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం నుంచి నివేదికను తీసుకుంది. వారితో ఉన్నతాధికారులను, సిట్​ ఛైర్మన్​లను కూడా విచారించింది. 

'దిశ’ అత్యాచార(disha case) కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌ ఉదంతంపై ఏర్పాటైన జస్టిస్‌ సిర్పుర్కర్‌ కమిషన్‌(justice sirpurkar commission) విచారణ కొనసాగుతోంది. సిర్పూర్కర్‌ కమిషన్ విచారణ చట్టవిరుద్ధంగా జరుగుతోందని డీఎస్పీ సురేందర్, సీఐ నర్సింహారెడ్డి హైకోర్టులో పిటిషన్​ దాఖలు చేయగా.. ఈరోజు వాటిని ధర్మాసనం కొట్టివేసింది.

Last Updated : Oct 28, 2021, 11:49 AM IST

ABOUT THE AUTHOR

...view details