high court: కుల సంఘాలకు భూకేటాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు - కుల సంఘాలకు భూ కేటాయింపులపై ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు నోటీసులు
13:56 August 18
కుల సంఘాలకు భూకేటాయింపుపై ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు
కమ్మ, వెలమ సంఘాలకు భూముల కేటాయింపుపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కమ్మ, వెలమ సంఘాల భవనాల నిర్మాణం కోసం ఖానామెట్‌లో ఐదు ఎకరాల చొప్పున భూమిని కేటాయిస్తూ జీవో జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు ఎ.వినాయక్ రెడ్డి దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.
అత్యంత ఖరీదైన భూమిని, కుల సంఘాల కోసం కేటాయించడం చట్టవిరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది సత్యంరెడ్డి వాదించారు. ప్రభుత్వం ఆగమేఘాలపై కేవలం నాలుగు రోజుల్లో భూముల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేసిందన్నారు. జీవో 47ని కొట్టివేయాలని పిటిషనర్ కోరారు. వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ, జస్టిస్ విజయసేన్ రెడ్డి ధర్మాసనం ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ.. విచారణ ఈనెల 28కి వాయిదా వేసింది.
ఇదీచూడండి:జీవోలన్నీ 24 గంటల్లో వెబ్సైట్లో పెట్టాలి: హైకోర్టు