ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణ 5వారాల పాటు వాయిదా - హైదరాబాద్ లేటెస్ట్ వార్తలు
14:02 December 09
ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణ 5వారాల పాటు వాయిదా
ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణ పథకం-ఎల్‌ఆర్‌ఎస్ అమలుపై విచారణను హైకోర్టు ఐదు వారాలకు వాయిదా వేసింది. ఎల్‌ఆర్‌ఎస్ పిటిషన్లపై కౌంటరు దాఖలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సమయం కోరింది. ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం రుసుములు నిర్ధరించి ప్రక్రియ ప్రారంభించగా కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు.
పిటిషనర్ల అభ్యంతరాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఉన్నత న్యాయస్థానం ఆదేశించగా.. ప్రభుత్వం గడువు అడిగింది. దీంతో విచారణను హైకోర్టు ఐదు వారాలకు వాయిదా వేసింది.
ఇదీ చదవండి:నారాయణపేట జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. నలుగురు మృతి