ఈడీ మాజీ అధికారి, జీఎస్టీ సూపరింటెండెంట్ శ్రీనివాస గాంధీకి హైకోర్టులో ఊరట లభించింది. నవంబరు 4 వరకు గాంధీని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తునకు అనుమతిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని కేంద్రం, విజిలెన్స్ డైరెక్టర్లను ఆదేశిస్తూ విచారణను నవంబరు 2కి వాయిదా వేసింది.
తనపై నమోదైన సీబీఐ కేసును సవాలు చేస్తూ.. గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టింది. దర్యాప్తునకు జీఎస్టీ కమిషనర్ ఆదేశించవచ్చు కానీ.. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రికి ఆ అధికారం లేదని గాంధీ తరఫు న్యాయవాది వాదించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆధారాలుంటే సీబీఐ ఇప్పటి దాకా ఎందుకు అభియోగ పత్రం దాఖలు చేయలేదన్నారు. ఏపీ సీఎం జగన్ కేసులో భాగంగా ఇందూ ప్రాజెక్ట్ నుంచి రూ.29 లక్షల 69 వేలు శ్రీష అసోసియేట్స్ పేరుతో వసూలు చేశారన్న ఆరోపణలు అవాస్తవమని వాదించారు.