ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ చేసిన వారి పెన్షన్లపై కోత విధించడం రాజ్యాంగ విరుద్ధమని సీనియర్ న్యాయవాదులు రాసిన లేఖలను హైకోర్టు ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అమర్ నాథ్‌తో కూడిన ధర్మాసనం ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టింది. ఈనెల 17లోగా దీనిపై వివరణ ఇవ్వాలని కోరింది.
కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్య సిబ్బందికి తగిన భద్రత కల్పించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ... న్యాయవాది కరుణ సాగర్ రాసిన లేఖను కూడా ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా స్వీకరించిన ధర్మాసనం... ఈనెల 17లోగా కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇటీవల గాంధీలో వైద్యులపై జరిగిన దాడిని సైతం ప్రస్తావించింది.