Telangana Haritha Utsavam today news :తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ హరితోత్సవం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అన్ని నియోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మొక్కలు నాటుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మొక్కలు నాటారు. డిప్యూటీ ఛైర్మన్ బండా ప్రకాశ్, ఎమ్మెల్సీ ఎల్.రమణ కూడా హరితహారంలో పాల్గొన్నారు. దాదాపు 57 కోట్ల మెుక్కలు నాటి దేశంలోనే మెుదటిస్థానంలో తెలంగాణ నిలిచిందని గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు.
MP Santosh at Haritha Haram Program in Uppal : మరోవైపు హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ హెచ్ఎండీఏ లే అవుట్లో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోశ్ కుమార్ ,ఎమ్మెల్యే భేతి సుభాశ్ రెడ్డితో కలిసి మొక్కలు నాటారు. హరితహారం కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌ను ప్రారంభించడం జరిగిందని సంతోశ్ కుమార్ తెలిపారు. ఇప్పటి వరకు హరిత హారం, గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా మొక్కలు నాటి.. వాటి సంరక్షణ బాధ్యత తీసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
Harish Rao on Haritha Haram : ప్రపంచంలోనే అన్ని మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతున్న అరుదైన ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని మంత్రి హరీశ్‌రావు అన్నారు. హరితహారాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. గ్రీన్ కవర్‌లో 7.7 శాతంతో అద్భుతమైన వృద్ధిని చూశామని.. ఇది సీఎం కేసీఆర్ గారి దూరదృష్టి వల్లే సాధ్యమైందని కొనియాడారు.
- Harish Rao on Telangana Green Cover : 'కేసీఆర్ దూరదృష్టితోనే.. తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7% వృద్ధి'
- Telangana Harithosthavam Today : నేడు 'తెలంగాణ హరితోత్సవం'.. మొక్కలు నాటనున్న సీఎం
Talasani Planted Saplings at Nehru Park :హైదరాబాద్ మారేడుపల్లిలోని నెహ్రూ పార్కులో హరితహారం కార్యక్రమంలో భాగంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మొక్కలు నాటారు. అనంతరం పద్మారావు నగర్‌లోని చిదానందం కాలనీలో నూతనంగా నిర్మించిన తెలంగాణ దశాబ్ది పార్కును, వెంకట్ రావు నగర్ పార్క్‌లను ప్రారంభించారు. మొక్కలు నాటుతూ చెట్లను పెంచడం మూలంగా ఆరోగ్యకరమైన ఆక్సిజన్ ప్రజలకు లభిస్తుందని అన్నారు.