జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. కార్పొరేట్ విద్యార్థులకు దీటుగా తెలంగాణ గిరిజన గురుకులాల్లో విద్యార్థులు ప్రతిభను ప్రదర్శించారు. సరైన వసతులు లేని మారుమూల ప్రాంతాల్లో చదివిన నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఉత్తమ పర్సంటైల్ సాధించారు.
జేఈఈ మెయిన్ ఫలితాల్లో గురుకుల విద్యార్థుల ప్రభంజనం
జేఈఈ మెయిన్ పరీక్షల్లో ఎస్సీ, ఎస్టీ గురుకుల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారు. 432 గిరిజన గురుకులాల్లో 274 మంది విద్యార్థులు ఉత్తమ పర్సంటైల్ సాధించినట్టు గురుకులాల సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
సాంఘిక సంక్షేమ గురుకులాలకు చెందిన 432 గిరిజన గురుకులాల్లో 274 మంది విద్యార్థులు ఉత్తమ పర్సంటైల్ సాధించినట్టు సొసైటీల కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. గౌలిదొడ్డి ఎస్సీ సంక్షేమ గురుకుల విద్యార్థి శ్రవణ్ కుమార్ 99.51 పర్సంటైల్ సాధించాడు. రాజేంద్రనగర్ గిరిజన సంక్షేమ గురుకుల విద్యార్థి కత్రోట్ అనిల్ 94.95 పర్సంటైల్ పొందాడు. హయత్నగర్ గిరిజన సంక్షేమ జూనియర్ కళాశాల విద్యార్థిని నాయిని మమత 89.11 పర్సంటైల్ సాధించింది. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అభినందించారు.
ఇదీ చూడండి :'ఒత్తిడికి గురికాకుంటేనే ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు'