కాలానుగుణంగా పరివర్తన చెందితే సంప్రదాయ ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు విస్తృతమవుతాయని గవర్నర్ తమిళిసై అభిప్రాయపడ్డారు. సీఐఐ, రాష్ట్రప్రభుత్వం, కేంద్ర డిపార్ట్‌మెంట్ ఫర్ ప్రమోషన్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ భాగస్వామ్యంతో జీఐ ఉత్పత్తుల మార్కెట్ ప్రదర్శనను గవర్నర్ ప్రారంభించారు.
భౌగోళిక గుర్తింపు ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన గవర్నర్
హైదరాబాద్లో భౌగోళిక గుర్తింపు ఉత్పత్తుల ప్రదర్శన ప్రారంభమైంది. ప్రదర్శనను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రారంభించారు. నెల రోజుల పాటు జీఐ ఉత్పత్తుల ప్రదర్శన కొనసాగనుంది.
భౌగోళిక గుర్తింపు ఉత్పత్తుల ప్రదర్శనను ప్రారంభించిన గవర్నర్
నెల రోజుల పాటు వర్చువల్‌గా జరగనున్న ఈ ఎక్స్‌పోను జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా(జీఐఎఫ్ఐ ఫెస్టివల్) పేరుతో సీఐఐ నిర్వహిస్తోంది. రాష్ట్రం నుంచి పోచంపల్లి చీరలు, నిర్మల్ బొమ్మలు, కరీంనగర్ ఫిలిగ్రీ, హైదరాబాద్ హలీం, పెంబర్తి పాత్రలు వంటి 15 జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తులు ప్రదర్శించనున్నారు. జీఐ ఉత్పత్తుల వినియోగం పెరిగేలా చర్యలు తీసుకున్నామని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ తెలిపారు.