రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2వేల కోట్లను రుణంగా తీసుకుంది. రిజర్వ్ బ్యాంకు ద్వారా రాష్ట్ర బాండ్ల విక్రయంతో బహిరంగ మార్కెట్లో అప్పు తీసుకుంది. 20 ఏళ్ల కాలానికి బాండ్లను వేలం వేసింది. ఏప్రిల్ నెలలో రూ.3000 కోట్లను రుణాల ద్వారా సమకూర్చుకొంది. తాజా రుణంతో 2021-22 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు మొత్తం రూ.5000 కోట్లకు చేరింది.
మరో రూ.2వేల కోట్ల అప్పు తీసుకున్న ప్రభుత్వం - తెలంగాణ వార్తలు
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2వేల కోట్లను అప్పు తీసుకుంది. రిజర్వు బ్యాంకు ద్వారా బాండ్ల విక్రయంతో బహిరంగ మార్కెట్లో రుణం పొందింది. ఈ ఏడాదిలో మొత్తం చేసిన అప్పు రూ.5వేల కోట్లకు చేరింది.
మరో రెండు వేల కోట్ల అప్పు, తెలంగాణ ప్రభుత్వ అప్పు