తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం - telangana government took loan in form of bonds

బాండ్ల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి రూ.2 వేల కోట్ల రుణం తీసుకుంది. సర్కారు మే నెలలో ఇప్పటివరకు రూ.4 వేల కోట్ల అప్పు సమకూర్చుకుంది.

telangana government took loan in form of bonds
మరోసారి రుణం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

By

Published : May 26, 2020, 7:57 PM IST

రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.2 వేల కోట్లను రుణంగా తీసుకుంది. బాండ్ల రూపంలో రూ. 1000 కోట్ల చొప్పున ఐదేళ్ల కాలానికి ఒకటి... ఆరేళ్ల కాలానికి మరొకటి అప్పుల ద్వారా సమకూర్చుకుంది. మే 12న రూ.2 వేల కోట్లను రుణంగా తీసుకున్న తెలంగాణ సర్కారు.. మంగళవారం మరో రూ.2 వేల కోట్లు తీసుకుంది.

ఇప్పటివరకు మే నెలలో రూ.4 వేల కోట్లను అప్పుగా తీసుకున్నట్లయింది. ఏప్రిల్​ నెలలోనూ రూ.4 వేల కోట్లను ప్రభుత్వం రుణంగా తీసుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రుణాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల నిధులను సమకూర్చుకుంది.

ఇదీ చూడండి:ఈ నెల 29న కొండపోచమ్మ జలాశయం ప్రారంభం: హరీశ్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details