తెలంగాణ

telangana

ETV Bharat / state

ZP FUNDS: జిల్లా, మండల ప్రజాపరిషత్​లకు రూ.250 కోట్ల నిధులు విడుదల

స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం జిల్లా, మండల పరిషత్​లకు తాజాగా రూ.250 కోట్ల నిధులను విడుదల చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ రాజ్ కమిషనర్ శరత్ నిధులను విడుదల చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ZP FUNDS: జిల్లా, మండల ప్రజాపరిషత్​లకు రూ.250 కోట్ల నిధులు విడుదల
ZP FUNDS: జిల్లా, మండల ప్రజాపరిషత్​లకు రూ.250 కోట్ల నిధులు విడుదల

By

Published : Dec 5, 2021, 3:30 AM IST

జిల్లా, మండల ప్రజాపరిషత్​లకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. రూ.250 కోట్ల రూపాయలను పంచాయతీరాజ్ శాఖ విడుదల చేసింది. గ్రామీణ ప్రాంత స్థానిక సంస్థల బలోపేతం కోసం చర్యల్లో భాగంగా జిల్లా ప్రజాపరిషత్, మండల ప్రజాపరిషత్​లకు నిధులు ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. పల్లెప్రగతి నిధుల నుంచి కేటాయింపులు చేస్తామని చెప్పారు. అందుకు అనుగుణంగా రూ.250 కోట్ల రూపాయలు విడుదల చేశారు. జిల్లా పరిషత్​లకు రూ.125.87 కోట్లు, మండల పరిషత్​లకు రూ.124.12 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ శరత్ ఆదేశాలు జారీ చేశారు.

ఈ నిధుల విడుదలకు సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధులను జిల్లా, మండల పరిషత్​ల అభివృద్ధి, వాటి పరిధిలోని ప్రజల పురోగతికి సక్రమంగా వినియోగించాలని మంత్రి సంబంధిత అధికారులను ఆదేశించారు.

ABOUT THE AUTHOR

...view details