కరోనా వైరస్ వ్యాప్తి కట్టడిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌ను ఈ నెల 31 వరకు పొడిగించింది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. సడలింపులతో కూడిన ఆంక్షలు కొనసాగనున్నాయి. రాత్రి వేళల్లో యథావిధిగా కర్ఫ్యూ అమల్లో ఉండనుంది. జీహెచ్‌ఎంసీ పరిధి మినహా జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాల రాకపోకలు కొనసాగుతాయని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
మాస్కులు తప్పనిసరి
రెస్టారెంట్లలో కేవలం పార్శిళ్లను మాత్రమే అనుమతించింది. సెలూన్లు, స్పా కేంద్రాలు తెరుచుకునే అవకాశం కల్పించింది. అయితే విధిగా మాస్కులు, చేతికి గ్లౌజులు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటించాల్సి ఉంటుంది. క్యాబ్, ఆటోలు నడుపుకోవచ్చు, ట్యాక్సీ, క్యాబుల్లో ముగ్గురు ప్రయాణికులకు మాత్రమే ప్రయాణించాలి, ఆటోలో ఇద్దరు మాత్రమే ప్రయాణించాల్సి ఉంటుంది. ప్రయాణికులంతా మాస్కులు తప్పనిసరిగా ధరించాల్సి ఉంటుంది.